ఏపీలో తిరుగులేని బలంతో ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అధికార వైసీపీ మాత్రమే. రాష్ట్రంలో ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనే తేడా లేకుండా అన్నిచోట్లా వైసీపీ చాలా బలంగా ఉంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో వైసీపీకి బలమైన నాయకత్వం ఉంది. అలాంటిది విజయవాడ వైసీపీకి కొత్త నాయకుడు ఎందుకు కావాలి అనే మేటర్‌లోకి వెళితే....మొన్నటివరకు విజయవాడలో టీడీపీ అనుకూలంగా ఉండేది. కానీ ఇప్పుడు విజయవాడలో వైసీపీ స్ట్రాంగ్ అయింది.


ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో విజయవాడలో వైసీపీ జెండా ఎగిరింది.  అయితే ఈ విజయానికి కారణం స్థానిక వైసీపీ నాయకత్వం బలంగా ఉండటం. తూర్పు ఇన్‌చార్జ్‌గా దేవినేని అవినాష్, అటు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెస్ట్ ఎమ్మెల్యే, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఐకమత్యంగా కష్టపడటంతో విజయవాడ కార్పొరేషన్ గెలవగలిగారు.



మరి అందరూ బలంగా ఉంటే నాయకుడు కావాల్సింది ఎక్కడ? అనే ప్రశ్న రావొచ్చు. అసెంబ్లీ స్థానాల్లో బలంగా ఉన్నా సరే పార్లమెంట్ పరంగా వైసీపీకి సరైన నాయకత్వం ఉన్నట్లు కనిపించడం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున కేశినేని నాని విజయవాడ పార్లమెంట్‌లో విజయం సాధించారు. వైసీపీ తరుపున పోటీ చేసిన పొట్లూరి వరప్రసాద్(పి‌వి‌పి) ఓటమి పాలయ్యారు.


ఓడిపోయాక పి‌వి‌పి పెద్దగా విజయవాడ రాజకీయాలపై దృష్టిపెట్టినట్లు కనిపించడం లేదు. ఏదో సోషల్ మీడియాలో కాస్త యాక్టివ్‌గా ఉంటున్నారుగానీ, స్థానికంగా పెద్దగా కనిపించడం లేదు. దీంతో పార్లమెంట్ స్థానంలో వైసీపీకి కొత్త నాయకుడు ఉంటే బాగుంటుందనే అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వస్తుంది.


విజయవాడ కార్పొరేషన్‌లో టీడీపీ ఓడిపోయినా సరే పార్లమెంట్ స్థానం పరంగా చూస్తే కేశినేని బలంగానే ఉన్నారు. ఆయనకు పార్టీ ఇమేజ్‌తో పాటు సొంత ఇమేజ్ ప్లస్ అవుతుంది. అయితే వైసీపీలో ఇలాంటి నాయకుడు లేరు. అందుకే వైసీపీకి బలమైన నాయకత్వం కావాల్సిన అవసరముంది. ఇప్పటినుంచే పార్లమెంట్ స్థానంలో పార్టీని బలోపేతం చేసుకుంటూ వస్తే, వచ్చే ఎన్నికల్లో గెలుపు సులువు అవుతుంది. మరి చూడాలి నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ తరుపున బరిలో దిగుతారో?


మరింత సమాచారం తెలుసుకోండి: