దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ రూపంలో ఉదృతంగా కొనసాగుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కరోనా వైరస్ మరింత తీవ్ర ప్రభావం చూపుతుంది. రోజుకు దేశం మొత్తం మీద లక్షల సంఖ్యలో కోవిడ్ కేసులు నమోదు అవుతున్నాయి. అంతే కాకుండా ఈ వ్యాదితో పాటు మరికొన్ని కొత్త రోగాలు కూడా వెలుగు చూడడం ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇటీవల కరోనా బారిన పడ్డ పలువురిలో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ వంటివి వెలుగు చూడడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. 

ఇక ఇవే కాకుండా కోవిడ్-19 రోగుల్లో బ్లాక్ ఫంగస్ బారిన బడ్డ వారికి గాంగ్రీస్ ( త్రాంబోసిస్ వ్యాధి ) లక్షణాలు కూడా వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ గాంగ్రీస్ కు కోవిడ్-19కు మధ్య సంబంధం ఉండే అవకాశం ఉందని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇక గాంగ్రీన్ కేసులు ఇటీవల పెరుగుతుడడంతో ఈ వ్యాధిని గుర్తించేందుకు అహ్మదాబాద్‌లోని వాస్కులార్ సర్జన్ డాక్టర్ మనిష్ రావల్ ఈ వ్యాధి లక్షణాల గురించి, చికిత్స విధానం గురించి తెలిపారు. ముఖ్యంగా రక్త ప్రసరణ, రక్తాన్ని ద్రవ రూపంలో ఉంచడంపై ప్రభావం పడుతోందన్నారు. దీనివల్ల త్రాంబోసిస్ వస్తోందన్నారు. త్రాంబోసిస్ వల్ల రక్తం గడ్డ కడుతుందన్నారు. 

ఫలితంగా దెబ్బతిన్న అవయవానికి రక్త ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతుందని చెప్పారు.. దీనినే గాంగ్రీన్ అంటారన్నారు. త్రాంబోసిస్‌ను వెంటనే గుర్తించి చికిత్స చేస్తే గాంగ్రీన్ రాదన్నారు. అంతే కాకుండా ఈ వ్యాధికి ముఖ్య కారణం రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ గాంగ్రీస్ రోగిపై మరింత ప్రభావం చూపుతుందని తెలిపారు. ముఖ్యంగా కోవిడ్ రోగుల్లో రోగనిరోధక శక్తి అధిక మొత్తంలో క్షీణించడం వల్ల వారిలో గాంగ్రీస్ అధిక ప్రభావం చూపుతుందని డాక్టర్ మనిష్ రావల్ తెలిపారు. ఈ గాంగ్రీస్ కూడా బ్లాక్ ఫంగస్ కు చెందినదేనని అన్నారు. ఇక ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ రోజురోజుకూ మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో ఎవ్వరూ కూడా నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.




మరింత సమాచారం తెలుసుకోండి: