కరోనా వైరస్ మనిషి జీవితాన్ని అల్లకల్లోలం చేసింది.. సాఫీగా సాగి పోతున్న  ఎన్నో జీవితాల్లో  తీరని విషాదాన్ని నింపింది. రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు కడుపు మాడ్చింది.  చివరికి కరోనా వైరస్ సోకి కాదు.. కరోనా కారణం గా ఉపాధి దొరక్క ఆకలితో అలమటించి పోయిన ప్రాణాలు కూడా ఎన్నో ఉన్నాయి. అంతే కాదు తల్లి దండ్రులను కోల్పోయి ఎంతో మంది పిల్లలు అనాథలుగా దుర్భర జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.   వైరస్ శర వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది అన్నది తెలిసిందే.



 సంతోషం గా ఉన్న ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది  ముఖ్యం గా తల్లిదండ్రుల పై పంజా విసిరి చివరికి ప్రాణాలు తీసి ఎంతో మంది పిల్లలను అనాథలుగా మార్చేసింది.  అయితే ఇలా కరోనా వైరస్ కష్ట కాలం లో తల్లి దండ్రులను కోల్పోయి అనాథగా మారిన పిల్లలను ఆదుకునేందుకు అటు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు కరోనా వైరస్ కాలంలో అనాథగా మారిన పిల్లల చదువులు, వసతి చూసుకునేందుకు హామీ ఇచ్చాయి. అటు కరోనా వైరస్ కారణం గా అనాధలుగా మారిన పిల్లలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.



 వైరస్ కారణం గా తల్లిదండ్రులు కోల్పోయిన అనాధ పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు అధికారులకు వెంటనే తెలియజేసేలా.. స్మార్ట్ఫోన్ ఉపయోగ పడుతుంది అని భావించి ఇక అనాధ పిల్లలకు స్మార్ట్ఫోన్లు ప్రభుత్వం తరఫున ఉచితం గా అందించాలని భావిస్తోంది  ప్రభుత్వం. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో శిశు సంరక్షణ అధికారి తో పాటు... పలువురు అధికారులు ఫోన్ నెంబర్లు కూడా ఉండనున్నాయి.  ఇలా స్మార్ట్ఫోన్లు అందించడానికి ఇప్పటికే ఎంతో మంది వివరాలను కూడా సేకరించారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: