నేటి రోజుల్లో చిన్నారులు అందరూ సెల్ఫోన్లకు వీడియో గేమ్ లకు ఎక్కువగా అలవాటు పడి పోయారు.. అడే నాటి కాలం లో..  ఎన్నో రకాల ఆటల తో చిన్నారులు అల్లరి చేసే వారు.  తొక్కుడు బిల్ల..  గోలీలాట.. దాగుడు మూతలు ఇలా చెప్పుకుంటూ పోతే నాటి రోజుల్లో ఆడిన ఆటలు చాలానే ఉన్నాయి. అయితే రవితేజ నా ఆటోగ్రాఫ్ సినిమా లోని గుర్తుకొస్తున్నాయి అనే పాట రాగానే.. అందరికీ ఈ మధుర జ్ఞాపకాలు మదిలో మెదులుతూ ఉంటాయి.  నేటి జనరేషన్ కు మాత్రం ఇవి అస్సలు తెలీదు.



 అయితే ఒకప్పుడు చిన్నారులు ఆడే ఆటలు కేవలం సరదా ఇచ్చే ఆటలు గానే కాకుండా.. అటు ఫిజికల్ ఎక్ససైజ్ గా కూడా పని చేస్తూ ఉండేది.  అయితే మొన్నటికి మొన్న పెద్దలు చెప్పిన విధం గానే చద్దన్నం స్టార్ హోటల్లో మెనూగా మారింది. ఇప్పుడు నాడు చిన్నారులు ఆడిన చిలిపి ఆటలే ఇప్పుడు ఒక యూనివర్సిటీ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ గా మారి పోయాయ్. ఏంటి షాక్ అవుతున్నారా .. కానీ ఇది నిజమే.  నాటి కాలం లో చిన్నారులు ఆడిన తొక్కుడు బిల్ల,గోలీలాట ఇటీవలే ఓ ఓయూ యూనివర్సిటీ లో ఫిజికల్ ఎడ్యుకేషన్ లో చేర్చారు.



 ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయింది. ఉత్తరప్రదేశ్లోని చౌదరి చరణ్ సింగ్ యూని వర్సిటీ లో అక్కడి అధికారులు  ఇలాంటి నిర్ణయం తీసు కున్నారు.  ప్రస్తుతం ఇలాంటి ఆటలు ఉనికిని కోల్పోతున్నాయి.  ఈ నేపథ్యంలో ఇక నాటి చిన్ననాటి ఆటలు  నేటి జనరేషన్కు పరిచయం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు తెలిపారు. ఈ ఆటలు కేవలం సరదాని పెంచడమే కాదు శరీరాన్ని దృఢం గా మారుస్తాయి  అని చెబుతున్నారు అక్కడి అధికారులు. విద్యార్థులకు ఏకాగ్రత కూడా పెంచుతాయని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: