కరోనా సమయంలో సర్కారు ఆదాయం పడిపోయింది. మరోవైపు సంక్షేమ పథకాలకు భారీగా డబ్బులు కావాలి. అందుకే ఇప్పటికే తెలంగాణ సర్కారు భూముల అమ్మకం ప్రారంభించింది. అందుకే ఇప్పుడు ఆదాయం కోసం మరో ప్లాన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. అదే వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువ పెంచడం. ఈ వ్యవసాయేతర భూముల విలువను ముప్పై నుంచి యాభై శాతం పెంచే అవకాశం ఉంది.

సాగు భూములకు కూడా ఇరవై శాతానికి పైగా మార్కెట్ విలువల పెంచే అవకాశం ఉందట. ఈ ప్రతిపాదనలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. సర్వే నెంబర్ల ఆధారంగా మార్కెట్ విలువ నిర్ధారిస్తారు. హైవేలు, జడ్పీ పంచాయతీ రోడ్ల పక్కన భూములకు ఎక్కువగా ఈ పెంపు ఉండే అవకాశం ఉంది. అడవుల సమీపంలో ఉండే భూములకు తక్కువ రేట్లు ఉంటాయట.

భూముల మార్కెట్ విలువను లెక్కగట్టడానికి ప్రభుత్వం త్వరలో కమిటీలు ఏర్పాటు చేయనుందట. అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీలో జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ర్టార్లు, మునిసిపల్ కమిషనర్లు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో హెచ్ఎండీఏ కమిషనర్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీలు ముందుగా ఆయా ప్రాంతాల్లో స్థలాలు వ్యవసాయ భూముల రేట్లను అధ్యయనం చేస్తాయి. ఏ సర్వే నెంబర్లు, పట్టణాలు నగరాలు హైవేల పక్కన ఉన్నాయో పరిశీస్తారు. వాటికి ఎంత ధర నిర్ణయించాలని పరిశీలిస్తారు.

ఇదివరకు ఉన్న ప్రభుత్వ విలువ బహిరంగ మార్కెట్ ధరల ఆధారంగా రేట్లు ఫిక్స్ చేసి సర్కార్ కు నివేదిస్తారు. దీన్ని బట్టి సీఎం, ఇతర ఉన్నతాధికారులు పరిశీలించి కొత్త సర్కారు ధరలను ఖరారు చేస్తారు. అంటే ఈ ఖరారు తర్వాత భూమి రిజిస్ర్టేషన్ చేసుకుంటే ఇప్పుడయ్యే ఖర్చు కంటే యాభై శాతం ఎక్కువ పన్ను కట్టాల్సి ఉంటుందన్నమాట. కరోనా సమయంలో అన్ని రంగాల నుంచి ఆదాయం తగ్గిపోయిన సమయంలో ఇక భూములు మాత్రమే ఆదాయ మార్గంగా కనిపిస్తోంది మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr