భారత్లో దాదాపు 5 పైగా వ్యాక్సిన్ కు సంబంధించిన పరిశోధనలు జరగాయి. ఇక ముందుగా సీరం ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన కోవిషీల్డ్ భారత్ బయోటెక్ కి సంబంధించిన కోవ్యాక్సిన్ టీకాలు 2-దశల క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోవడంతో ఇక వాటికి అత్యవసర వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక ఇప్పుడు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు భారత ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోంది. టీకా ప్రక్రియలు భారత్ దూసుకుపోతున్న తీరు అగ్రరాజ్యాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే వాక్సినేషన్ లో భారత్ ఏకంగా అగ్రరాజ్యమైన అమెరికా ను కూడా దాటేసింది.
ఇప్పటివరకు అమెరికాలో సింగల్ డోస్ 32 కోట్ల 33 లక్షల మందికి ఇచ్చారు. తాజాగా భారత్ ఇక అమెరికా ని క్రాస్ చేసింది. 32 కోట్ల 36 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ అందించింది భారత్. అగ్రరాజ్యమైన అమెరికాను ఇలా వ్యాక్సినేషన్ ప్రక్రియలో దాటేసింది. ఒక వెనుకబడిన దేశంగా ఉన్న భారత్ ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియలో అగ్రరాజ్యాన్ని సైతం దాటేయడం గొప్ప విషయం అని అంటున్నారు విశ్లేషకులు. అయితే జనాభా పరంగా చూసుకుంటే అటు అమెరికాలో ఇప్పటికే 90% శాతం వ్యాక్సినేషన్ పూర్తయిందని కానీ వ్యాక్సిన్ డోసులు పరంగా చూసుకుంటే భారత్ మాత్రం అమెరికాను దాటేసింది అని అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి