అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ భారత్ పై దాడి చేసినప్పుడల్లా ఊహించని విధంగా ఎదురుదాడికి దిగింది భారత్. అయితే ఇటీవలే ఏకంగా డ్రోన్లతో పాకిస్తాన్ దాడి చేసింది. అయితే ఆ డ్రోన్లను పాకిస్థాన్ సైన్యం కాకుండా ఉగ్రవాదులు పంపించిన కూడా.. ఇక ఉగ్రవాదులను పెంచి పోషించేది పాకిస్తాన్ కాబట్టి పరోక్షంగా పాకిస్తాన్ దాడి చేసినట్లు అవుతుంది. అయితే పాకిస్తాన్ డ్రోన్ల దాడి తర్వాత అటు భారత ఆర్మీ ఎలా స్పందిస్తుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పటికే పాకిస్తాన్ దుశ్చర్యలకు అడ్డుకట్ట వేసేందుకు భారత్ రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్ చేసింది.
ఇటీవలే భారత చరిత్రలోనే మొదటిసారి డ్రోన్ దాడి జరిగిన నేపథ్యంలో భారత్ మూడోసారి కూడా సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఎందుకంటే ఇటీవలే కాశ్మీర్లో జరిగిన డ్రోన్ దాడిపై త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్పందించారు పాకిస్తాన్ దుశ్చర్యల పై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ సరైన సమయంలో సరైన ప్రాంతంలో దీటుగా ఎదురు దాడి చేస్తోంది అంటూ బిపిన్ రవాట్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారిపోయింది. దీన్ని బట్టి చూస్తే మరి కొన్ని రోజుల్లో భారత్-పాకిస్థాన్ పై సమయం చూసి సర్జికల్ స్ట్రైక్ చేసే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. ఇక అటు విశ్లేషకులు కూడా సర్జికల్ స్ట్రైక్ తప్పదు అని అంచనా వేస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి