ఇదిలా ఉంటే వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నుంచి గెలిచి టిఆర్ఎస్ లోకి జంప్ చేసిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి ని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 7వ తేదీ తర్వాత తన అసలు సిసలు రాజకీయ ప్రయాణం మొదలవుతుందని... పార్టీ ఫిరాయింపులు కు పాల్పడిన ఎమ్మెల్యేలను ఉరికిస్తామని రేవంత్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రేవంత్ కు అత్యంత సన్నిహితుడు అయిన గండ్ర సత్యనారాయణ కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల్లో భూపాలపల్లి కాంగ్రెస్ టిక్కెట్ ను గండ్ర సత్యనారాయణకు ఇచ్చేలా రేవంత్ చక్రం తిప్పుతున్నారు. అందుకే గతంలో కాంగ్రెస్ నుంచి గెలిచి పార్టీ మారిన గండ్ర వెంకటరమణా రెడ్డి రేవంత్ టార్గెట్ చేస్తున్నారని భూపాలపల్లి నియోజకవర్గం లో ప్రచారం జరుగుతోంది. ఎలాగైనా కాంగ్రెస్ ను మోసం చేసిన గండ్ర వెంకట రమణా రెడ్డికి చెక్ పెట్టేలా రేవంత్ ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారనే అర్థమవుతోంది. ఏదేమైనా రేవంత్ ప్రతి నియోజకవర్గంలోనూ నమ్మకస్తులను ఇప్పటి నుంచే సెట్ చేసుకుంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి