తెరాసలో చేరినటువంటి పాడి  కౌశిక్ రెడ్డికి జిహెచ్ఎంసి అధికారులు షాక్ ఇచ్చారు. తెరాసలో చేరిన సందర్భంగా  హైదరాబాద్ నగరంలో అనుమతి లేకుండా అనేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్న కారణంతోనే ఈ జరిమానా విధించామని జిహెచ్ఎంసి అధికారులు  చెప్పారు. మొత్తం 5.6 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు సమాచారం. ఆయన  బుధవారం సాయంత్రం వేళ సీఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకుని కౌశిక్ రెడ్డి తెరాసలో చేరిన సందర్భంగా  ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి తండ్రి  సాయినాథ్ రెడ్డి తనకు ఆప్త మిత్రుడని, తెలంగాణ ఉద్యమ సమయంలో  సాయినాథ్ రెడ్డి తో కలిసి పని చేశామని గుర్తు చేశారు.

 ఇక నుంచి రాష్ట్రంలోని ప్రతి అభివృద్ధికి  భాగస్వామ్యం కావాలని ఆయన తెలిపారు. ఆనాడు  ప్రొఫెసర్ జయశంకర్ సహకారాలతో ఉద్యమాన్ని నడిపామని ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులు  ఎదుర్కొంటూ ఉద్యమాన్ని కొనసాగించామని తెలిపారు. పార్టీలు గెలవడం, ఓడిపోవడం   అనేది సహజమని. శాశ్వతంగా ఏ ఒక్కరు అధికారంలో కూడా ఉండరని, ఇది రాచరిక వ్యవస్థ కాదని కేసీఆర్ పేర్కొన్నారు. ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేకుండా అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని అందుకే ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారని ఆయన అన్నారు . దేశంలో  దళిత వర్గాలు అణచివేతకు  గురవుతున్నారని తెలిపారు. అందువలన తెలంగాణలో దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చామని, ఈ పథకాన్ని చూసి ఓర్వలేని కొంతమంది బీపీ పెంచుకుంటున్నారని అన్నారు.

రైతుబంధుతో రైతు ఇప్పుడు ఎంతో ధీమాగా ఉన్నాడని తెలంగాణలో ఎవరు ఏం చేసినా కరెంటు అనేది పోదని చెప్పుకొచ్చారు. ముందు కొండాపూర్లోని తన ఇంటి వద్ద  పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ హుజురాబాద్ అభివృద్ధి చేయడం కోసమే  తెరాస పార్టీలో చేరుతున్నట్టు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ఈటెల దుర్వినియోగ పరిచారని ఆరోపించారు. నియోజకవర్గ ప్రజలను ఆదుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: