పొలిటిక‌ల్‌గా ఎప్పుడూ.. దూకుడుగా ఉండే.. టీడీపీ నేత‌లు.. ఓ విష‌యంలో మాత్రం ఫుల్లు సైలెంట్ పాటించార‌నే వాద‌న వినిపిస్తోంది. అది కూడా ఏపీ స‌ర్కారుకు చెందిన కీల‌క విష‌య‌మే కావ‌డంతో ఇప్పుడు ఈ చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ``అస‌లేం జ‌రిగింది? ఆ విష‌యంపై ఒక్‌్రంటే ఒక్క‌రు కూడా మాట్లాడ‌రేంటి?`` అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఇంత‌కీ విష‌యంలోకి వెళ్తే.. వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజుపై సీఐడీ పోలీసులుకేసు న‌మోదు చేయ‌డం తెలిసిందే. అదేస‌మ‌యంలో ఆయ‌న జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కోరుతూ.. కోర్టులో కేసు దాఖ‌లుచేశారు. ఈ క్ర‌మంలో ఈకేసును సుప్రీం కోర్టు విచార‌ణ‌కు తీసుకుంది.

సీఐడీ కేసులో ప్ర‌భుత్వాన్ని సుప్రీం కోర్టు నిల‌దీసింది. ఎంపీపైనే థ‌ర్డ్ డిగ్రీ చేస్తారా? అంటూ.. ప్ర‌శ్నించింది. ఈ క్ర‌మంలో సీఐడీ త‌న వాద‌న‌ను అఫిడ‌విట్ రూపంలో కోర్టుకు స‌మ‌ర్పించింది. అయితే.. ఈ క్ర‌మంలో ఏపీ ప్ర‌భుత్వం ర‌ఘురామ‌తోపాటు.. చంద్ర‌బాబును, ఆయ‌న కుమారుడిని కూడా అఫిడ‌విట్‌లో పేర్కొంది. ర‌ఘురామరాజు.. ఏపీ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా కుట్ర ప‌న్నార‌ని.. ఆయ‌న వ‌ల్ల ప్ర‌భుత్వానికి అప్ర‌తిష్ట వ‌చ్చింద‌ని.. ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేలా ప్ర‌తిప‌క్ష నేత‌, చంద్ర‌బాబు, ఆయ‌న అనుకూల మీడియాతోనూ చేతులు క‌లిపార‌ని.. ప్ర‌భుత్వం త‌న అఫిడ‌విట్లో పేర్కొంది. దీనికి సంబందించి కొన్ని వాట్సాప్ చాటింగుల‌ను కూడా అఫిడ‌విట్‌కు దాఖ‌లు చేసింది.

దీనిని వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది. ఈ అఫిడ‌విట్ కూడా సుప్రం కోర్టు వెబ్‌సైట్‌లో స్ప‌ష్టంగా ఉండ‌డం తో చంద్ర‌బాబుతో ర‌ఘురామ జ‌రిపిన వాట్సాప్ చాటింగ్ వివ‌రాలు బ‌య‌ట‌కు పొక్కాయి. అయితే.. ఇంత జ‌రిగినా.. చంద్ర‌బాబు కానీ, ఆయ‌న కుమారుడు లోకేష్ కానీ.. ఇత‌ర నేత‌లు కానీ.. కిమ్‌.న‌లేదు. పైగా అస‌లు త‌మ‌కేమీ తెలియ‌దు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. నిజానికి జ‌గ‌న్‌పైనా ప్ర‌భుత్వంపైనా ఎప్పుడు అవ‌కాశం ద‌క్కితే అప్పుడు విరుచుకుప‌డే టీడీపీ నేత‌లు ఇలా ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటే.. ర‌ఘురామ వెనుక వీరు ఉండి.. అంతా న‌డిపించారా? అందుకే మౌనంగా ఉన్నారా?  అనే సందేహాలు తెర‌మీదికి వ‌చ్చాయి. అంతేకాదు.. టీడీపీ అనుకూల మీడియా కూడా ఈ విష‌యంలో `బ్యాన‌ర్‌` హెడ్డింగులు లేకుండా.. అస‌లు వార్త‌లే రాకుండా చూసుకోవ‌డం మ‌రింత ఆశ్చ‌ర్య‌కరంగా ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇదే పార‌ద‌ర్శ‌క రిపోర్టింగ్ అంటూ.. ప్ర‌శ్నిస్తున్నారు. ఏదేమైనా.. చంద్ర‌బాబు మ‌ళ్లీ చిక్కుకున్నార‌నే వాద‌న మాత్రం వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: