ప్ర‌స్తుతం అంతా ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా క‌రాళ‌మే క‌న‌ప‌డుతోంది. ఏ ముహూర్తాన ఈ మ‌హ‌మ్మారి మాన‌వాళిపై ఎటాక్ చేయ‌డం ప్రారంభించిందో కాని అప్ప‌టి నుంచి ప్ర‌పంచ‌మే కుదులే అయిపోయింది. క‌రోనా దెబ్బ‌తో ప్ర‌పంచంలో అన్ని వ్య‌వ‌స్థ‌లు అత‌లా కుత‌లం అయిపోయాయి. మ‌రో వైపు క‌రోనా దెబ్బ‌తో ఏం తినాల‌న్నా.. ఏం ముట్టుకోవాల‌న్నా కూడా ప్ర‌జ‌లు భ‌యంతో వ‌ణికి పోతున్నారు. క‌రోనాకు ముందు వ‌ర‌కు ప్ర‌జ‌లు ఎక్క‌డిక‌క్క‌డ రోడ్ల మీద‌కు వ‌చ్చేసి త‌మ‌కు ఇష్టం వ‌చ్చింది తినేసేశారు. ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్లు, రెస్టారెంట్ల‌తో జ‌నాలు బిజీబిజీగా ఉండేవారు. అయితే ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చి ఏం తినాల‌న్నా కూడా ప్ర‌జలు భ‌య‌ప‌డిపోతున్నారు.

ఇక క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచే ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే క‌రోనా గురించి బ‌య‌ట‌కు వ‌చ్చిన మ‌రో స‌ర్వే దిమ్మ‌తిరిగి పోయేలా ఉంది. ఈ స‌ర్వే అనేక భ‌యాన‌క నిజాలు బ‌య‌ట ప్రపంచానికి తెలియ‌జేసింది. పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డే వారికి క‌రోనా చాలా సులువుగా ఎటాక్ అవుతుంద‌ట‌. వీరికి క‌రోనా సోకితే వారు త్వ‌ర‌గా చ‌నిపోయే ప్ర‌మాదం ఉంద‌ని కూడా శాస్త్ర‌వేత్త‌లు చెపుతున్నారు.

పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డే వారికి అంటు వ్యాధులు త‌ర‌చుగా ఎటాక్ అవుతాయ‌న్న‌ది ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న‌కు తెలిసిందే. తాజా అధ్య‌య‌నంలో పోష‌కాహార లోపంతో ఉండే 18 - 78 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ఉండే వారికి క‌రోనా చాలా సులువుగా ఎటాక్ అవుతుంద‌ని ఈ ప‌రిశోధ‌న చెప్పింది. వీరిలో రోగ నిరోధ‌క శ‌క్తి చాలా త‌క్కువుగా ఉండ‌డం వ‌ల్ల వీరు క‌రోనాకు చాలా సులువుగా దొరికిపోతార‌ని ఈ అధ్య‌య‌నం చెప్పింది. ఈ ప‌రిశోధ‌న కోస‌మే    8604 మంది పిల్లలు 94495 మంది పెద్దలపై పరిశోధనలు చేశారు.

ఇందులో పోష‌కాహార లోపంతో బాధ‌ప‌డేవారే ఎక్కువుగా క‌రోనా భారీన ప‌డిన‌ట్టు తేలింది. ఏదేమైనా పోష‌కాహారం తీసుకునే విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: