ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుత రోజుల్లో చాలా వింతలు, విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. ఇదంతా సైన్స్ అని కొంత మంది చెబుతుంటే అదేం కాదు ప్రపంచం అంతం అయ్యే రోజులు దగ్గరపడ్డాయని అందుకే ఇలా జరుగుతోందని కొందరు వాదిస్తున్నారు. వారి వాదనల మాట ఎలా ఉన్నా సరే ప్రస్తుతం చాలా వింతలు చోటు చేసుకుంటున్నాయి. ఆవు ఒకే ఈతలో రెండు దూడలకు జన్మనివ్వడం లాంటి అనేక వింతలను మనం విన్నాం, కొన్ని చోట్ల కళ్లతో చూశాం కూడా. కానీ మనం ఇప్పుడు వినబోయే వార్తను వింటే ఆశ్చర్యపోవడం ఖాయం.
 
ఇజ్రాయెల్‌ దేశంలోని ఆష్ డోడ్ పట్టణంలోని ఓ ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన ఓ ఆడశిశువు గర్భం దాల్చి ఉండడాన్ని చూసి వైద్యులు ఖంగుతిన్నారు. తల్లి గర్భంలో నుంచి అప్పుడే బయటకు వచ్చిన ఆ శిశువును గర్భం దాల్చడం ఎలా సాధ్యమవుతుందని మొదట ఆశ్చర్యపోయారు. కానీ తర్వాత మాత్రం ఇది కూడా ఒక రకమైన డిసీస్ అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. ఇది వ్యాధే కాకపోతే కేవలం పది లక్షల మంది శిశువుల్లో ఎవరో ఒకరికే ఇలా గర్భంలో ఉండగానే పిండాలు తయారవుతాయి.

మరో విషయమేంటంటే ఈ శిశువుకు ఒకటి కంటే ఎక్కువ పిండాలు ఉండడం డాక్టర్లు గమనించారు. ఇలా ఈ పిండాల్లో గుండె, ఎముకలు కూడా డెవలప్ అయ్యాయని డాక్టర్లు వివరించారు. తర్వాత ఆ చిన్నారికి ఆపరేషన్ చేసి... పిండాలను తొలగించారు. ప్రస్తుతం ఆ చిన్నారిని వైద్యుల సంరక్షణలో ఉంచారు. ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని డాక్టర్ ఓమర్ తెలిపారు. శిశువు కడుపులో ఉన్న పిండాలు ఇప్పుడిపుడే రూపాలను సంతరించుకుంటున్నాయని ఆయన తెలిపారు. ఇలాంటి సమస్య చాలా అరుదుగా సంభవిస్తుందని ప్రపంచవ్యాప్తంగా పుట్టే శిశువుల్లో 10 లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని తెలిపారు. ఆ చిన్నారికి సర్జరీ చేసి పిండాలను తొలగించాం కనుక మరే సమస్య లేదని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: