దాదాపు రెండు దశాబ్దాల కిందట ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లు ఆధిపత్యాన్ని చేపట్టిన తర్వాత మహిళల బ్రతుకు ఎంత దుర్భరంగా  మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు మహిళలు మనుషులే కాదు బానిసల కంటే హీనం అన్న విధంగా తాలిబన్లు మహిళల విషయంలో వ్యవహరించారు. ఇక ఆ తర్వాత తాలిబన్ల రాజ్యం తొలగిపోవడంతో ఆఫ్ఘనిస్థాన్లో మహిళలు మళ్ళి హక్కులు సాధించారు. స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు. ఇక ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ ఆధిపత్యాన్ని చేపట్టడంతో మహిళల జీవితం మళ్లీ ఎంత దుర్భరంగా మారిపోతుందో అని అటు అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేసింది.


 ఇలాంటి సమయంలోనే తమ చట్టాల్లో మార్పులు తీసుకు వస్తామని మహిళలకు సముచిత గౌరవం కల్పిస్తామని..  మహిళలపై దాడులు చేయబోము అంటూ తాలిబన్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. అంతేకాదు తమ ప్రభుత్వంలో కూడా మహిళలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. కానీ తాలిబన్ల మాటలను మాత్రం అంతర్జాతీయ సమాజం నమ్మలేదు  ఇక ఇప్పుడు తాలిబన్ల ముసుగు తొలగుతూ అసలు రంగు బయటపడుతుంది . కాబుల్ ని  స్వాధీనం చేసుకున్న రోజున దేశ ప్రజలందరికీ క్షమిస్తాము  అంటూ తాలిబన్లు ప్రకటించారు.


 మహిళలతో కూడిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అంటూ బాహాటంగా చెప్పారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే క్షేత్రస్థాయిలో తాలిబన్లు చేయాలనుకుంటుంది మరొకటి అన్నది అర్ధమవుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో పడుపు వృత్తిలో ఉన్న వేశ్యలు అందరిని  కూడా గుర్తించి వారిని బహిరంగంగా ఉరి తీసేందుకు ప్రస్తుతం తాలిబన్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇక దీని కోసం పోర్న్ వెబ్సైట్లను చూసి మరి సెక్స్ వర్కర్ లను గుర్థిస్తున్నారట. ఇలా విదేశీయులతో శృంగారంలో పాల్గొన్న ఆఫ్ఘనిస్తాన్ మహిళలను గుర్తించి ఇక అందరి ముందు బహిరంగంగా వారికి ఉరి శిక్ష విధించపోతున్నట్లు ధ సన్ అనే పత్రిక ఒక వార్త ప్రచురితం చేసింది.  అంతే కాదు కేవలం తమకు నచ్చిన వారిని మాత్రమే ఇక సెక్స్ బానిసలుగా వాడుకునేందుకు తాలిబన్లు సిద్ధమవుతున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: