ఈ రోజు టీడీపీ తెలుగు యువ‌త ఎంతో ఆనందంగా ఉంది. అదే విధంగా నాన్న (ఎర్ర‌న్న‌) ను గుర్తుకు తెస్తూ యువ ఎంపీ చేసే ప్ర‌తి మంచి ప‌నీ త‌మ‌కు ఎంతో గుర్తింపు ఇస్తుంద‌నీ చెబుతోంది. శ్రీ‌కాకుళం పార్ల‌మెంట్  నియోజ‌క‌వ‌ర్గంకు చెందిన తెలుగు యువ‌త అధ్య‌క్షులు మెండ దాసునాయుడుతో సహా ప్ర‌జా స‌ద‌న్ కార్యాల‌య వ‌ర్గాలు అన్నీ యువ ఎంపీ చేప‌డుతున్న సామ‌జిక హిత కార్య‌క్ర‌మాల్లో త‌మ వంతు బాధ్య‌త‌ను నిర్వ‌ర్తిస్తున్నాయి. అదేవిధంగా రామూ కూడా ఇప్పుడు మ‌రిం యాక్టివ్ అయ్యారు. నాన్న గారి ఆశీస్సులు, బాబాయ్ దీవెన‌లు లేకుంటే నేనెక్క‌డ స‌ర్ అని అంటారు. ఆ విధంగా వారిద్ద‌రి స్ఫూర్తితో ప‌నిచేసే రాము ఇంకొ న్ని మంచి ప‌నుల‌కు శ్రీ‌కారందిద్దాల‌ని టీడీపీ కోరుకుంటోంది. ఇక అధినేత ఎన్న‌డూ ప్రోత్స‌హించేందుకే ముందుంటారు.మా అధినేత న‌న్ను పిలిచి వెల్డ‌న్ మై బోయ్ అంటే చాలు అండి నేనెంత ఆనందిస్తానో అని అంటారు రాము హెరాల్డ్ మీడియాతో..నాన్నకు అత్యంత స‌న్నిహితంగా భావించే న్యాయ‌వాదుల‌కు ఓ గూడు ఇవ్వాల‌ని కోరుకుంటున్నారు ఎప్ప‌టి నుంచో ఆ కోరిక నెర‌వేర్చే దిశ‌గా అడుగులు వేశారు..ఈ రోజు.. శ్రీ‌కాకుళం బార్ అసోసియేష‌న్ బిల్డింగ్ కు త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధులు ఇచ్చి, మీ క‌ల‌ను నెర‌వేర్చుకోండి అంటూ శంకు స్థాప‌న కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. లాయ‌ర్ల కుటుంబాల‌తో త‌నకున్న అనుబంధాల‌ను చెప్పారు.
శ్రీ‌కాకుళం రాజ‌కీయాల్లో అసలు వివాదాలు లేని కుర్రాడు అత‌డు. మంచి వ్య‌క్తిత్వం ఉన్న‌వాడు. ముఖ్యంగా త‌న దగ్గ‌ర‌కు నియోజ క‌వ‌ర్గాల‌కు అతీతంగా ప్ర‌జ‌లు వ‌చ్చి చేరుతారు అంటే ఇదే ప్ర‌ధాన కార‌ణం. నాన్న ఆశ‌యాల‌ను సెంటిమెంట్ల‌నూ ఎన్న‌డూ గౌర‌విం చి ఆచ‌రించి  చూపుతారు. ముఖ్యంగా ప్ర‌జాస‌ద‌న్ అన్న‌ది నాన్న ఆశ‌యం. న్యాయ వ‌ర్గాల‌తోనూ, న్యాయ కోవిదుల‌తోనూ చ‌ర్చిం చ‌డం నాన్న‌కు ఇష్టం. ఇవి ప‌రిగ‌ణించి ఆయ‌న ప్ర‌జా స‌ద‌న్ ను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. దేశంలో ఓ మారుమూల ప్రాంతాని కి చెందిన ఎంపీ, త‌న‌దైన బాట‌లో సాగారు. ఇంత మంచి క‌ల‌ను కన్నారు నాన్న‌ది ఆ క‌ల నేను నెరవేర్చాను. ఏ ఎంపీకీ ఇంత‌టి గౌర‌వం లేదు. నాన్న‌కు ఉంది. నాన్న ద్వారా నాకూ ద‌క్కింది అంటారు యువ ఎంపీ రామూ.. హెరాల్డ్ మీడియాతో...
యువ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు నాన్న బాట‌లో న‌డుస్తున్నారు. నాన్న‌కు క‌లిసివ‌చ్చిన అన్ని విష‌యాల‌పై ఇప్ప‌టికీ ఆయ‌న కు ఓ న‌మ్మ‌కం ఉంది. ఆ నమ్మ‌కాన్ని ఆచ‌రించేందుకు ఆయ‌న ఎన్న‌డూ సిద్ధంగా ఉంటారు. నాన్న‌కు లా చ‌దువు అంటే ఇష్టం. ఆంధ్రా యూనివ‌ర్శిటీ నుంచి బీఎల్ ప‌ట్టా కూడా అందుకున్నారు. ఎర్ర‌న్నాయుడు నాడు లాయ‌ర్ల‌తో స‌న్నిహితంగా ఉండేవారు. వి ద్యార్థి రాజ‌కీయాలు అంటే ఆయ‌న‌కు ఇష్టం. అదేవిధంగా లీగ‌ల్ ఇష్యూస్ పోరాడేవారు.
ఆయ‌న‌కు మంచి స్నేహితులు ఉన్న కార‌ణంగా అవ‌న్నీ బాగా అర్థం అయ్యేవి. ఇప్పుడు రామూ కూడా నాన్న‌ను ఇష్ట‌ప‌డే వర్గాని కి ఇంకొంత చేరువ అవుతున్నారు. బార్ కౌన్సిల్ కు ఈ రోజు కొత్త భ‌వ‌న నిర్మాణానికి సంబంధించి శంకు స్థాప‌న చేశారు. ఇందు కు ఆయ‌న ఎంపీ ల్యాడ్ నిధులు కేటాయించారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను ఇచ్చిన మాట‌ల‌ను గుర్తు చేసుకుంటూ, బార్ కౌ న్సిల్ కు ఆయ‌న అండ‌గా ఉన్నారు. త‌న‌ను ఆశీర్వ‌దించి పంపిన లాయ‌ర్లంటే ఎంతో గౌర‌వం అని, రెండు ప‌ర్యాయాలూ త‌న‌కు ఇ దే విధం అయిన గౌర‌వం ద‌క్కింద‌ని, వీరి కోసం ఏమ‌యినా చేయాల‌న్న త‌లంపులో భాగంగానే బార్ అసోసియేష‌న్ భ‌వంతి కి త‌న నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధులు ఇచ్చాన‌ని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap