ఏపీలో మళ్ళీ కాపుల చుట్టూ రాజకీయం తిరగడం మొదలైంది. నాయకులు అనూహ్యంగా క్యాస్ట్ పాలిటిక్స్ తీసుకొచ్చారు. రాష్ట్రంలో అత్యధిక ఓట్లు ఉన్న కులం కాపులే కాబట్టి వారి టార్గెట్‌గానే రాజకీయాన్ని మొదలుపెట్టారు. గత ఎన్నికల్లో కాపులు మెజారిటీ సంఖ్యలో జగన్‌కు మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే. కొంతవరకు జనసేనకు కూడా సపోర్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడుప్పుడే కాపుల మనసు మారుతున్నట్లు తెలుస్తోంది. రెండున్నర ఏళ్లలో కాపులకు జగన్ చేసింది ఏమి లేదని ప్రతిపక్ష టి‌డి‌పి విమర్శిస్తూనే ఉంది.

ముఖ్యంగా రిజర్వేషన్ల విషయాన్ని ప్రస్తావిస్తుంది. కనీసం అగ్రవర్గాల పేదలకు ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్ల విషయంలో కూడా కాపులకు న్యాయం చేయడం లేదని, కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు కూడా ఇవ్వట్లేదని అంటున్నారు. అయితే ఇంతవరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్..కాపులకు సంబంధించిన అంశాలపై పెద్దగా మాట్లాడలేదు. తాజాగా సినీ పరిశ్రమకు సంబంధించి మాట్లాడుతూ కాపు రిజర్వేషన్లని ప్రస్తావించారు.


టి‌డి‌పి అధికారంలో ఉండగా కాపు రిజర్వేషన్లు గురించి హడావిడి చేశారని, మరి వైసీపీ అధికారంలోకి వచ్చాక కాపు రిజర్వేషన్ల ప్రస్తావన ఎందుకు తీసుకు రావడం లేదని అడిగారు. వాస్తవానికి చూసుకుంటే టి‌డి‌పి ఉండగా ముద్రగడ పద్మనాభం లాంటి వారు గట్టిగానే రిజర్వేషన్ల గురించి పోరాడారు. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన సైలెంట్ అయిపోయారు. ఇదిలా ఉంటే తాజాగా పవన్‌పై విమర్శలు చేసే సందర్భంలో మంత్రి పేర్ని నాని...కాపులు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా కాపు వర్గానికే చెందిన నేత కావడంతో, ఆ వర్గం గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడేశారు.

మంత్రి అలా మాట్లాడటం కరెక్ట్ కాదని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఎంత ఒకటే వర్గమైన మాత్రాన కాపు వర్గంపై మాట్లాడటం సరికాదని రఘురామకృష్ణంరాజు లాంటి వారు అంటున్నారు. అంటే కాపులని వైసీపీకి యాంటీ చేసే పనిలో ప్రతిపక్షాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో కాపులు ఎవరికి కాపు కాస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp