శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పేరు వినబడితే చాలు...కింజరాపు కుటుంబం పేరు ఆటోమేటిక్‌గా వినిపిస్తోంది. ఎందుకంటే జిల్లాలో టి‌డి‌పి బలంగా నిలబడటానికి ఆ కుటుంబమే కారణమని చెప్పొచ్చు...గతంలో ఎర్రన్నాయుడు...ఇప్పుడు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడులు పార్టీని నిలబెట్టడానికి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ హవా ఉన్నా సరే శ్రీకాకుళం జిల్లాలో టి‌డి‌పి సైతం కాస్త స్ట్రాంగ్‌గా కనబడటానికి కింజరాపు ఫ్యామిలీనే కారణమని చెప్పొచ్చు.

అలా టి‌డి‌పి వైపు బలంగా నిలబడిన అచ్చెన్న, రామ్మోహన్‌లకు చెక్ పెట్టాలని వైసీపీ గట్టిగానే ప్రయత్నిస్తుంది. గత ఎన్నికల్లో అంతటి జగన్ గాలిలో సైతం రామ్మోహన్...శ్రీకాకుళం ఎంపీగా గెలిస్తే, అచ్చెన్న...టెక్కలి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటికీ ఆయా స్థానాల్లో వారు బలంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ వైసీపీ వారి బలాన్ని తగ్గించడానికి గట్టిగానే ట్రై చేస్తుంది. ముఖ్యంగా టెక్కలిలో అచ్చెన్నని దెబ్బకొట్టడానికి దువ్వాడ శ్రీనివాస్ గట్టిగానే కష్టపడుతున్నారు.

గత ఎన్నికల్లో దువ్వాడ...శ్రీకాకుళం పార్లమెంట్‌లో రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు. మళ్ళీ జగన్...దువ్వాడని టెక్కలి ఇంచార్జ్‌గా పెట్టారు. దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో దువ్వాడ టెక్కలిలో పోటీ చేయడం ఖాయమైంది. అయితే 2014 ఎన్నికల్లో టెక్కలిలో అచ్చెన్న మీద దువ్వాడ పోటీ చేసి ఓడిపోయారు. అంటే బాబాయి-అబ్బాయిల మీద పోటీ చేసి దువ్వాడ ఓటమి పాలయ్యారు. అందుకే ఈ సారి ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలని దువ్వాడ ప్రయత్నిస్తున్నారు. టెక్కలిలో అచ్చెన్నకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే పంచాయితీ, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో పైచేయి సాధించారు. కాకపోతే అధికార పార్టీకి స్థానిక ఎన్నికలు అనుకూలంగా ఉంటాయని చెప్పొచ్చు.

అయితే సాధారణ ఎన్నికల్లో పరిస్తితి ఎలా ఉంటుందనేది చూడాలి. టెక్కలిలో అచ్చెన్నకు చెక్ పెట్టడం అంత సులువైన పని కాదు. మరి దువ్వాడ ఏ మాత్రం అచ్చెన్నని ఓడించడానికి ట్రై చేస్తారో చూడాలి. అటు శ్రీకాకుళం పార్లమెంట్‌లో రామ్మోహన్ ప్రత్యర్ధి ఇంకా డిసైడ్ కాలేదు. నెక్స్ట్ ఎన్నికల్లో అక్కడ వైసీపీ తరుపున ఎవరు బరిలో దిగుతారో తెలియడం లేదు. కానీ ఎవరు బరిలో దిగిన రామ్మోహన్‌కు చెక్ పెట్టడం కష్టమే అని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: