దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముద్దుల కూతురు వైయస్ షర్మిల తెలంగాణ రాష్ట్రంలో... వైయస్సార్సీటిపి పేరుతో నూతన పార్టీ ని తెరపైకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ ప్రారంభం చేయకముందు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై దండయాత్ర ప్రారంభించింది వైయస్ షర్మిల. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలపై... కెసిఆర్ స ర్కార్ ను ప్రశ్నిస్తోంది వైయస్ షర్మిల. అలాగే.. ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం..  ప్రతివారం నిరుద్యోగ నిరసన దీక్ష చేస్తోంది వైఎస్ షర్మిల. 

ఇలా వరుసగా నిరసన  కార్యక్రమాలు చేపడుతూ కేసీఆర్ సర్కార్ పై ఒత్తిడిని పెంచుతుంది వైఎస్ షర్మిల. అయినప్పటికీ ప్రజల్లో... వైయస్ షర్మిల పార్టీకి మంచి ఆదరణ ల భించడం లేదు. ఈ నేపథ్యంలోనే వైయస్ షర్మిల కొత్త వ్యూహ రచన చేస్తుందని సమాచారం. ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరాం పార్టీ తో జత కట్టాలని వైయస్ షర్మిల ఆలోచన చేస్తుందట.

ఇందులో భాగంగానే ఇప్పటి కే ప్రొఫెస ర్ కోదం డ రాం  తో పలు సార్లు వైయస్ షర్మిల చర్చలు జరిపినట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై ప్రొఫె సర్ కోదండ రాం కూడా చాలా సానుకూలంగా స్పందిం చిన ట్లు సమాచారం అందుతోంది.  అన్ని ఓకే అయితే త్వరలోనే ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  20 23 ఎన్నిక లే లక్ష్యంగా పొత్తు కుదు ర్చుకుని ముందుకు సాగాలని రెండు పార్టీలు కృత నిశ్చయం తో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమ నాయకులను కూడా తమతో కలుపుకుపోవాలని వై యస్ షర్మిల కోదండరాం తో చెప్పినట్టు తెలుస్తోంది. ఇందు లో భాగంగానే త్వరలోనే కోదండరామ్ ఇంటికి వైయస్ షర్మిల వెళ్లి అవకాశం కూడా సమా చా రం.

మరింత సమాచారం తెలుసుకోండి: