టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఆ పార్టీ లో న‌మ్మ‌క‌మైన నేత‌లే వ‌రుస‌గా షాకులు ఇస్తూ వ‌స్తున్నారు. బాబు కూడా ఎప్పుడు ఎవ‌రిని న‌మ్మాలో తెలియ‌క కొట్టు మిట్టాడుతున్నారు. తాజాగా చంద్ర‌బాబుకు మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియ‌ర్ నేత గుమ్మ‌డి కుతూహ‌ల‌మ్మతో పాటు ఆమె కుమారుడైన జీడీ నెల్లూరు పార్టీ  ఇన్‌చార్జ్ హ‌రికృష్ణ షాక్ ఇచ్చిన‌ట్టు టాక్‌. చంద్ర‌బాబు సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా లో జీడీ నెల్లూరు కుతూహ‌ల‌మ్మ‌కు మంచి ప‌ట్టున్న ప్రాంతం. గ‌తంలో ఈ ప్రాంతం వేపంజ‌రి పేరుతో నియోజ‌క‌వ‌ర్గంగా ఉండేది. కుతూహ‌ల‌మ్మ అక్క‌డ నుంచే మూడున్న‌ర ద‌శాబ్దాలుగా రాజ‌కీయాలు చేసుకుంటూ వ‌చ్చారు. చంద్ర‌బాబు కాంగ్రెస్ లో ఉన్న‌ప్పుడే ఆమెను జ‌డ్పీ చైర్మ‌న్‌ను చేయ‌డంలో ఆయ‌న కీల క పాత్ర పోషించారు.

అయితే 2014 ఎన్నిక‌ల్లో ఏపీలో కాంగ్రెస్ భూస్థాపితం కావ‌డంతో కుతూహ‌ల‌మ్మ టీడీపీలోకి వ‌చ్చారు. ఆ ఎన్నిక‌లలో ఆమె ప్ర‌స్తుత ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి చేతిలో ఓడిపోయారు. ఇక మొన్న ఎన్నిక‌ల‌లో ఆమె  పోటీ నుంచి త‌ప్పుకుని ఆమె వార‌సుడు హ‌రికృష్ణ కు సీటు ఇప్పించుకున్నారు. హ‌రికృష్ణ కూడా నారాయ‌ణ స్వామి చేతిలో ఓడిపోయారు. అయితే తాజాగా నియోజ‌క‌వ‌ర్గంలో కుతూహ‌ల‌మ్మ ప్రాధాన్య‌త త‌గ్గిస్తూ బాబు నిర్ణ‌యం తీసుకోవ‌డంతో త‌ల్లి , కొడుకలు ఇద్ద‌రూ పార్టీ కి రాజీనామా చేస్తున్న‌ట్టు లేఖ‌ను చంద్ర‌బాబుకు పంపిన‌ట్టు తెలుస్తోంది.
 
ఇక గ‌త ఎన్నిక‌ల టైం నుంచే వీరిద్ద‌రు వైసీపీలోకి వెళ్లి పోతార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇక ఇప్పుడు వైసీపీలో నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిణామాలు శ‌ర వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలో రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని ,ఆ పార్టీ నేత‌ల‌ను టార్గెట్ గా చేసుకుని నారాయ‌ణ స్వామి రెచ్చి పోతూ వ్యాఖ్య‌లు చేస్తున్న‌ట్టు అక్క‌డ ఆ పార్టీ నేత‌ల్లో చ‌ర్చ వినిపిస్తోంది. దీంతో వారంతా ఇప్పుడే ఏక‌మై  వ‌చ్చే ఎన్నిక‌ల‌లో నారాయ‌ణ స్వామిని త‌ప్పించేందుకే హ‌రికృష్ణ ను వైసీపీలోకి ఆహ్వానిస్తున్న‌ట్టు భోగ‌ట్టా ?

మరింత సమాచారం తెలుసుకోండి: