ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్పంద‌న‌పై గురువారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.  జిల్లాల క‌లెక్ట‌ర్ల‌కు, అధికారుల‌ను ఆదేశించారు. కొన్ని సూచ‌న‌లు సూచించారు. ముఖ్యంగా ఉపాధిహామీ ప‌నుల‌పై దృష్టిసారించాల‌ని అధికారుల‌కు వివ‌రించారు సీఎం. విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌ప‌ట్ట‌ణం, శ్రీ‌కాకుళం, అనంత‌పురం జిల్లాల‌లో మెటీరియ‌ల్ కాంపొనెంట్ వినియోగంపై దృష్టి పెట్టండి. కృష్ణా, తూర్పుగోదావ‌రి, క‌ర్నూలు జిల్లాలు గ్రామానికి చెందిన స‌చివాల‌యం నిర్మాణంలో చాలా వెనుకంజ‌లో ఉన్నాయ‌ని గుర్తు చేశారు. స‌చివాల‌య భ‌వ‌నాల‌ను త్వ‌ర‌లోనే పూర్తి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి. అదేవిధంగా రైతుభ‌రోసా కేంద్రాల‌కు సంబంధించిన భ‌వ‌నాల‌ను కంప్లీట్ చేయాల‌ని పేర్కొన్నారు. క‌ర్నూలు, కృష్ణా, తూర్పుగోదావ‌రి జిల్లాల క‌లెక్ట‌ర్లు వీటిపై దృష్టి పెట్టాల‌ని సూచ‌న‌లు చేశారు.

అదేవిధంగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌పై  ఫోక‌స్ చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. గ్రామాల‌లో డిజిట‌ల్ లైబ్ర‌రీలు ఏర్పాటు చేస్తున్నాం అని.. ఎలాంటి అవాంతరాలు ఏర్ప‌డ‌కుండా ఇంట‌ర్‌నెట్ స‌ర‌ప‌రా చేయాలి. తొలివిడుత కింద 4314 లైబ్ర‌రీల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావ‌రి, విజ‌య‌న‌గ‌రం, శ్రీ‌కాకుళం, విశాఖ‌ప‌ట్నం జిల్లాల‌కు సంబంధించిన క‌లెక్ట‌ర్లు వీటిపై ప్ర‌త్యేకంగా ఫోక‌స్ చేయాల‌ని సూచించారు.

పంట కొనుగోలు ప్ర‌క్రియ చేప‌ట్టాలంటే ఈ-క్రాపింగ్ విధానం చేయాల‌ని సూచించారు. ఆర్బీకేల ప్రాథ‌మిక విధి ఈ-క్రాపింగ్ చేయించ‌డం.  క‌లెక్ట‌ర్లు, జాయింట్ క‌లెక్ట‌ర్లు  ఈ-క్రాపింగ్‌, సీఎంయాప్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టాలి. ఈ-క్రాపింగ్ చేసిన త‌రువాత డిజిట‌ల్ ర‌శీదుతో పాటు, భౌతికంగా ర‌శీదు ఇస్తున్నారా లేదా అనేది అధికారులు ప‌రిశీలించాల‌న్నారు. ఈ-క్రాపింగ్ ఉంటేనే పంట‌ల బీమా, సున్నావ‌డ్డీ, పంట‌కొనుగోలు, ఇన్‌పుట్ స‌బ్సీడీ వంటివి స‌వ్యంగా జ‌రుగుతాయని సీఎం చెప్పారు. నెల‌లో మొద‌టి శుక్ర‌వారం ఆర్బీకేల‌, రెండో శుక్ర‌వారం మండ‌ల‌, మూడ‌వ శుక్ర‌వారం జిల్లాల స్థాయిలో అడ్వ‌యిజ‌రి స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని సూచించారు. ఇక నాలుగ‌వ శుక్ర‌వారం వ్య‌వ‌సాయ‌శాఖ కార్య‌ద‌ర్శి స‌మ‌క్షంలో రాష్ట్రస్థాయి స‌మావేశం నిర్వ‌హించాల‌ని తెలిపారు. ఈనెల 26న రైతుభ‌రోసా రెండ‌వ విడుత నిధులు విడుద‌ల అవుతాయ‌ని వెల్ల‌డించారు సీఎం.  


మరింత సమాచారం తెలుసుకోండి: