ఆంధ్రా,తెలంగాణ విడిపోయి ఏడున్న‌రేళ్లు అవుతోంది. ఈ కొద్ది కాలంలో ఏపీ అభివృద్ధి ప‌రంగా కానీ  మ‌రో విష‌య‌మై కానీ తెలం గాణ‌తో పోటీ ప‌డ‌లేక‌పోతోంది అన్న‌ది వాస్తవం. ఇదే నిన్న‌టి వేళ కేసీఆర్ కూడా త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. పెట్టుబ‌డుల‌కు తెలంగాణ స్వ‌ర్గ‌ధామం అని కూడా చెబుతూ, ఏపీలో అస‌మ‌ర్థ స‌ర్కారు ఉంద‌న్న విధంగా కొన్ని మాట‌లు చెప్పారు. వీటిపై ఎవ్వ‌రూ నోరే మెద‌ప‌డం లేదు. వైసీపీ స‌ర్కారు పెద్ద‌లు ఎవ్వ‌రూ కేసీఆర్ వ్యాఖ్య‌ల‌పై పెద్ద‌గా కౌంట‌ర్ ఇవ్వ‌నే ఇవ్వ‌లేదు. అంటే ప‌రోక్షంగా కేసీఆర్ వ్యాఖ్య‌లను కానీ వీళ్లు స‌మ‌ర్థిస్తున్నారా అన్న సందేహం ఒక‌టి తలెత్త‌క మాన‌దు.


కేసీఆర్ ఎప్పుడు తిట్టినా జ‌గ‌న్ ప‌ట్టించుకోడు. చేత‌గాని చేవ‌లేని ప్ర‌భుత్వం ఆంధ్రాలో ఉంది అని అన్నా కూడా జ‌గ‌న్ ప‌ట్టించుకోడు. అదేవిధంగా అంధకారంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉంది అన్నా కూడా ప‌ట్టించుకోడు. ఏ జ‌రిగినా అస్స‌లు ప‌ట్టించుకోడు. ఎందుకంటే జ‌గ‌న్ కు కేసీఆర్ కు మంచి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి క‌నుక! అవే ఇప్పుడు బ‌ల‌ప‌డనున్నాయి కూడా! అందుకే జ‌గ‌న్ త‌న‌ను ఏ మన్నా, త‌న ప్ర‌భుత్వాన్ని ఏమ‌న్నా కూడా ప‌ట్టించుకోడు. చీమ కుట్టిన విధంగా కూడా ఉండ‌దు గాక ఉండదు. అదేవిధంగా రాష్ట్ర పాల‌న‌కు సంబంధించి, విద్యుత్ విధానాల‌కు సంబంధించి కూడా ఎటువంటి వ్యాఖ్య‌లు తెలంగాణ సీఎం నుంచి వ‌చ్చినా కూడా నిద్ర న‌టిస్తూ ఉంటారు.


ప్లీన‌రీ సంద‌ర్భంగా నిన్న‌టి వేళ జ‌గ‌న్ స‌ర్కారు ను తిడుతూనే భూములకు సంబంధించి కూడా కొన్ని మాట‌లు చెప్పారు. మ‌న ద‌గ్గ‌ర భూముల విలువ ఎక్కువ‌గా ఉంద‌ని, అదేవిధంగా జ‌గ‌న్ స‌ర్కారు హయాంలో ఉన్న ఆంధ్రాలో భూముల విలువ చాలా మే ర‌కు ప‌డిపోయింద‌ని సోదాహ‌ర‌ణ‌గా చెప్పాడు. ఏం చెప్పినా ఏం చేసినా ఇవాళ రియ‌ల్ట‌ర్లంతా చుక్కలు చూస్తున్నారు. ఊపిరి బిగ బ‌ట్టుకుని కాలం నెట్టుకువ‌స్తున్నారు. ఎవ్వ‌రికీ ఆదాయం అన్న‌ది లేకుండా పోయింది. అందుకే కేసీఆర్ ఆంధ్రా పాల‌కుల‌పై నిప్పు లు చెరిగినా ఇక్క‌డి నాయ‌కులెవ్వ‌రూ అంత‌గా రియాక్ట్ కాక‌పోవ‌డానికి కార‌ణం అందులో ఉన్న రియాల్టీనే!

మరింత సమాచారం తెలుసుకోండి:

trs