ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ ఇక వరుసగా తీసుకుంటున్న నిర్ణయాలు తెలంగాణ రాష్ట్ర ప్రజల మన్ననలను పొందుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రజలందరికీ ఆర్టీసీని మరింత చేరువ చేసే విధంగా సజ్జనార్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అంతేకాదు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తూ ఉండటం గమనార్హం. హైదరాబాద్ నగరంలో బస్ స్టాప్ లను కొత్త హంగులతో తీర్చిదిద్దడం అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రముఖ బస్ స్టేషన్లలో అన్నిరకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం లాంటివి చేస్తున్నారు.


 ఇలా ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ ముందుకు సాగుతున్నారు టిఎస్ ఆర్టిసి ఎండి సజ్జనార్. ఇక  సజ్జనార్ నిర్ణయం తీసుకోవడమే కాదు ప్రతి విషయంలో కూడా తనదైన శైలిలో పనితీరు కనబరుస్తున్నారు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు కూడా మరోసారి కీలక నిర్ణయం తీసుకుని ప్రజలందరికీ రోడ్డు రవాణాను మరింత చేరువ చేసేందుకు ముందడుగు వేశారు. గతంలో తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కూడా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేవి అన్న విషయం తెలిసిందే.


 ఎంతోమంది తెల్లవారుజాము నుండే ఈ బస్సు సర్వీసులను ఉపయోగించుకునేవారు.. ముఖ్యంగా ఉదయం సమయంలో దూరప్రాంతాలకు వెళ్లే వారికి బస్సు సర్వీసులు ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. కానీ ఆ తర్వాత కరోనా వైరస్ కారణంగా ఇక ఉదయం సమయం లో ఉండే బస్సు సర్వీసులను కూడా పూర్తిగా రద్దు చేసింది టీఎస్ఆర్టీసీ. కానీ ఇప్పుడు తెల్లవారుజామున 4 గంటలకు మరోసారి బస్సు సర్వీసులను ప్రారంభిస్తూ తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెల్లవారుజామున 4గంటల నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డు ఎక్కుబోతున్నాయి. సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్ లతోపాటు ఎంజీబీఎస్ జేబీఎస్ సహా అన్ని బస్టాండ్ లలో కూడా బస్సులు అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: