ఎన్నికలు జరుగుతున్న సమయంలో వివిధ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదులపై జిల్లా ఎస్పీ వెంటనే స్పందించినట్లు నీలం సాహ్ని చెప్పుకొచ్చారు. ఇక కుప్పం మున్సిపాలిటీలో 72.19% పోలింగ్ నమోదయింది అన్న విషయాన్ని నమోదైంది. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూమ్ లో కట్టుదిట్టమైన భద్రత మధ్య భద్ర పరిచినట్లు నీలం సాహ్ని చెప్పుకొచ్చారు. అయితే అర్బన్ లోకల్ బాడీస్ లో కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది.
కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫలితాలను వెల్లడిస్తామని ఆమె అన్నారు. అయితే జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల18న ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. 12 మున్సిపాలిటీలకు చైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎంపిక కోసం ఈనెల 22వ తేదీన ప్రత్యేక సమావేశంలో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామంటూ ఎన్నికల కమిషనర్ నీలం సాహనీ అన్నారు. అదేరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కు మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కూడా జరుగుతుందని తెలిపారు. దీంతోపాటు ఎటపాక మండల ప్రజాపరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు కూడా అదే రోజు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి