తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల క‌విత క‌సితో ర‌గిలి పోతున్నారా ? 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆమె సిట్టింగ్ ఎంపీ గా ఉండి.. బీజేపీ నుంచి పోటీ చేసిన ధ‌ర్మ‌పురి అర్వింద్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. పై గా తెలంగాణ లో టీఆర్ ఎస్ వ‌రుసగా రెండోసారి ఘ‌న‌విజ‌యం సాధించిన నాలుగు నెల‌ల‌కే జ‌రిగిన ఎన్నిక‌ల్లో కేసీఆర్ కుమార్తె గా , పైగా సిట్టింగ్ ఎంపీ గా ఉండి క‌విత ఓడిపోవ‌డం ఆమెకు మైన‌స్ అయ్యింది.

అయితే ఇప్పుడు క‌విత ఓడిన చోటే గెల‌వాల‌న్న క‌సితో ఉన్న‌ట్టే తెలుస్తోంది.. మ‌న పెద్ద‌లు చెప్పిన సామెత చందంగా పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాల‌ని ఆమె క‌సితో ఉన్నారు. అందుకే కవిత ఇటీవ‌ల రాజ్య‌స‌భ స‌భ్యుడి గా ఉండి ఎమ్మెల్సీ గా ఎంపిక కాబోతున్న బండ ప్ర‌కాశ్ ముదిరాజ్ ప్లేస్ లో రాజ్య‌స‌భ‌కు వెళ‌తార‌ని ముందు నుంచి ప్ర‌చారం జ‌రిగింది. అయితే ఇప్పుడు ఈ ప్ర‌చారం అంతా ఉత్తితే అని తేలిపోయింది.

క‌విత మ‌రోసారి ఎమ్మెల్సీ గా వెళుతున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల కోటాలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్సీ గా ఉన్న  క‌విత మ‌రోసారి ఇప్పుడు ఎమ్మెల్సీ గా వెళుతున్నారు. రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌డం ఆమెకు ఎంత మాత్రం ఇష్టం లేద‌ని.. 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల‌లో మ‌రోసారి ఆమె నిజామాబాద్ నుంచే పోటీ చేసి అర్వింద్ ను చిత్తుగా ఓడించాల‌న్న క‌సితో ఉన్నార‌ని టీఆర్ ఎస్ వ‌ర్గాలు చెపుతున్నాయి.

త‌న‌ను ఓడించ‌డంతో పాటు కేసీఆర్ ను ,టీఆర్ ఎస్ ప్ర‌భుత్వాన్ని ప‌దే ప‌దే ఇరుకున పెడుతోన్న అర్వింద్ ను చిత్తు గా ఓడించి స‌గ‌ర్వంగా మ‌రోసారి లోక్‌స‌భ లో అడుగు పెట్టాల‌న్న‌దే క‌విత ల‌క్ష్యంగా క‌నిపిస్తోంది. అందుకే ఆమె రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌లేదంటున్నారు. మ‌రి క‌విత కోరిక వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఎలా నెర‌వేరుతుంది ?  అప్పుడు రాజ‌కీయాలు ఎలా ?  మార‌తాయో ?  చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: