ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు కొన‌సాగుతున్నాయి. ఈ క్రమంలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మయంలో చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో రెవెన్యూశాఖ‌కు చెందిన చెరువులు, కుంట‌లు ఆక్ర‌మ‌ణ‌ల‌పై వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మ‌హిధ‌ర్ రెడ్డి మాట్లాడారు.. అనేక ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంట‌లు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గుర‌వుతున్నందు వ‌ల్లే నేడు వ‌ర‌ద‌లు వ‌స్తున్నాయి అని తెలిపారు. ఆక్ర‌మ‌ణ‌కు గుర‌య్యాయి అని అడిగితే.. అవును అని మంత్రి చెపుతున్నారు. శాఖాప‌రంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నాం అని.. ఎప్ప‌టిలాగే రోటిన్ స‌మాధానం ప్ర‌తి సారి చెపుతున్నారు.. దీనికి సంభ‌దిత జిల్లా క‌లెక్ట‌ర్లు, సూప‌రేండెంట్ ఇంజ‌నీర్ల‌ను భాద్యులుగా చూస్తామ‌ని సుప్రీంకోర్టు చెప్పానా పట్ట‌న‌ట్టు వ్య‌వ‌హరిస్తున్నారు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.


   ఎన్ని రెవెన్యూ కుంట‌లు, చెరువులు ఆక్ర‌మ‌ణ‌లు  జ‌రిగాయ‌ని..  ఆక్ర‌మ‌ణ‌లు జ‌రుగుతుంటే గ్రామాల్లో ఉన్న  వీఆర్వోలు, స‌ర్వేయ‌ర్లు సేవ‌లు ఎందుకు వినియోగించుకోవ‌డం లేదు అని ప్ర‌శ్నించారు. రెవెన్యూ, పంచాయితీల‌లో ఉన్న‌ కుంట‌లను స‌దుద్దేశంతో పూర్వీకులు ఏర్పాటు చేశార‌ని ఈ సంద‌ర్భంగా చెప్పుకొచ్చారు. కానీ, వీటిన ప్రైవేటు వ్య‌క్తుల పేర్ల‌పై వెబ్ పోర్టింగ్ చేసేశారు అని చెప్పారు. అలా చేసిన అధికారుల‌పై ఎలంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నారో చెప్పాలి అని ప్ర‌శ్నించారు మ‌హిధ‌ర్ రెడ్డి.


 ఈ ప్ర‌శ్న‌ల‌కు డిప్యూటీ సిఎం మంత్రి ధ‌ర్మాన కృష్ణ‌దాసు స‌మాధానమిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా 1216 గ్రామాల్లో 5236ఎక‌రాలు  ఆక్ర‌మ‌ల‌కు గుర‌య్యాయి అంటూ వివ‌రించారు. వెయ్యి కోట్ల రూపాయ‌ల‌తో మూడు ద‌శ‌ల్లో స‌ర్వే చేయిస్తున్నామ‌ని.. ఇది గ‌నుక పూర్త‌యితే ఈ స‌మ‌స్య‌ల్లో చాలా వ‌ర‌కూ ప‌రిష్కారం అవుతాయంటూ వెల్ల‌డించారు. అయితే, ఇటీవ‌ల భారీ వ‌ర్షాల కార‌ణంగా చెరువులు, కుంట‌లు నిండిపోవ‌డంతో గ్రామాలు అత‌లాకుతలం అయిన విష‌యం తెలిసిందే. చెరువులు, కుంట‌లు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురికావ‌డ వ‌ల్లే వ‌రద‌లు ఎక్కువ ప్ర‌భావాన్ని చూపాయి. మ‌రి ఇప్ప‌టికైనా ప్ర‌భుత్వం చెరువులు, కుంట‌ల‌పై అక్ర‌మంగా నిర్మించిన క‌ట్టాల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: