అధికారంలో ఉన్న పార్టీ ఒకసారి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ఆ నిర్ణయం మీదే నిలబడి పోరాడవలసి ఉంటుంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకూడదు. ఒక్కసారి అలా వెనక్కి తీసుకోవడం మొదలైంది అంటే చాలు.. ప్రతిపక్షాల నుంచి విమర్శలు రావడం, ఎన్నో ఎదురుదెబ్బలు తగలడం మొదలవుతుంది. ఇక ఇటీవలే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిన మోడీ ప్రభుత్వం వ్యవసాయ చట్టాల విషయంలో యూటర్న్ తీసుకోవడం మాత్రం  తీవ్ర విమర్శలకు దారితీసింది అని చెప్పాలి. అయితే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా caa చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ చట్టాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారంగా తమతమ రాష్ట్రాలలో  అమలు చేసుకోవచ్చు అంటూ నిబంధన పెట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ప్రస్తుతం బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో సీఎఏ చట్టంఅమలులో ఉంది. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సీఏఏ చట్టం అమలులో ఉండటం పై స్పందించిన ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైసీ వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి.


 ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అమలులో ఉన్న సిఏఏ చట్టాన్ని   తొలగించాలి అంటూ వ్యాఖ్యానించిన ఓవైసీ.. ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే  ఉత్తరప్రదేశ్ రోడ్లను కూడా  స్థంబింప చేస్తాం  ఒవైసీ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనంగా మారిపోయాయ్. ఒక రకంగా ఈ వ్యాఖ్యలు ఏకంగా యోగి సర్కార్ కి సవాలు విసిరాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై అటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా స్పందించారు. రోడ్లను స్తంభింపజేస్తాం అంటే  చూస్తూ ఊరుకునేందుకు తాము సిద్ధంగా లేమని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తెలిపింది. దీంతో ఇక ఈ విషయంలో రానున్న రోజుల్లో యోగి వర్సెస్ ఓవైసీగా మారే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: