ఎవ‌రి విశ్వాసం వారిది ఎవ‌రి న‌మ్మ‌కం వారిది.. ఉన్నంత‌లో ప‌దిమందికీ అండ‌గా ఉండ‌డం అన్న‌ది మంచి ప‌ని. మంచిని పంచే ప‌ని. కానీ కొంద‌రు అధికార పార్టీ ప్ర‌తినిధులు మాత్రం కొంచెం ఎక్కువ‌గానే స్వామీజీల‌పై ఆధార‌ప‌డుతున్నారు. వారి పూజ‌లు, నోములు ఫ‌లితంగానే తాము ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామ‌ని భావించ‌వ‌చ్చు. కానీ వారికి అప్ప‌ణంగా కోట్లు విలువ చేసే భూములు అప్ప‌గించ‌డం ఎంత మాత్రం భావ్యం కాదు. తాజాగా వైసీపీ ప్ర‌తినిధి వైవీ ఇంకా చెప్పాలంటే ప్ర‌భుత్వ పెద్ద వైవీ విశాఖ స్వామి సేవ‌లో త‌రించారు. వాస్త‌వానికి జ‌గ‌న్ న‌మ్మ‌కాలు వేరు, విశ్వాసాలు వేరు. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకోవ‌డం త‌గ‌దు కానీ హిందూ మ‌త వ‌ర్గాల‌కు తాము ఎన్న‌డూ ద‌గ్గ‌ర‌గానే ఉన్నామ‌ని, ఉంటామ‌ని చెప్పేందుకే వైవీ ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నా రా? అన్న అనుమానం ఆయ‌న న‌డ‌వడి చూసిన వారెవ్వ‌రికైనా క‌ల‌గక మాన‌దు.

విశాఖ న‌గ‌రంలో నిన్న‌టి వేళ ఆర్కే బీచ్ వేదిక‌గా కార్తీక దీపోత్స‌వం జ‌రిగింది. ఈ వేడుక‌కు వైవీ సుబ్బారెడ్డి అనే టీటీడీ చైర్మ‌న్ వెళ్లారు. విశాఖ శార‌దా పీఠం పెద్ద స్వ‌రూపానందేంద్ర హ‌యాంలో ఈ వేడుక ను నిర్వ‌హించారు. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది కానీ ఒక స్వామీజీ చుట్టూనో ఓ పీఠం చుట్టూనే అలా ఓ ప్ర‌భుత్వ పెద్ద ఎందుక‌ని ప్ర‌ద‌క్షిణ‌లు చేయ‌డం? దాని వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏంటి? ఇప్ప‌టికే స్వామీజీకి ఇవ్వాల్సిన భూమి ఇచ్చేశారు క‌దా! ఇంకేం కావాల‌ని? సామాన్య ప్ర‌జ‌ల క‌ష్టాలు, వారి బాధ‌లు తీర్చేలా టీటీడీ ఉన్నా లేదా ప్రభుత్వం ఉన్నా మంచిదే కానీ ఇలాంటి చ‌ర్య‌ల వ‌ల్ల ఎటువంటి ఫ‌లితం ఉండదు.

ఈ తరుణంలో ఈ నేప‌థ్యంలో
వైసీపీకి సంబంధించి ఇప్పుడొక వాద‌న  వినిపిస్తోంది. అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా స్వామీజీల చుట్టూ తిరుగుతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోందని!  దీని వల్ల విశ్వాసాలు న‌మ్మ‌కాలు ఎలా ఉన్నా ప్ర‌భుత్వం ప్ర‌త్యేకించి హిందువులను త‌మ వైపు ఆక‌ర్షించుకో వాల‌న్న ఆలోచ‌న‌లో ఉంద‌న్న విమ‌ర్శ కూడా ఉంది. వాస్త‌వానికి జ‌గ‌న్ న‌మ్మ‌కాలు ఎలా ఉన్నా కూడా స్వామీజీల  సేవ‌లో ఎందుకు కాలం వెచ్చించి రావాల్సి వ‌స్తుందో ఎవ్వ‌రికీ అంతుప‌ట్ట‌డం లేదు. గ‌తంలో టీడీపీ స‌ర్కారు ఇలా లేదు. టీడీపీకి ప్ర‌త్యేకించి స్వామీజీలు లేరు. అలా అని టీడీపీ అన్ని మ‌తాల‌ను గౌర‌వించ‌లేదా అంటే అన్నింటినీ గౌర‌వించింది. అన్ని మ‌త విశ్వాసాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంది. కానీ ఇక్క‌డ మాత్రం విశాఖ స్వ‌రూపానందేంద్ర ఒక్క‌రే తెర‌పైకి క‌నిపిస్తూ ప్ర‌భుత్వాన్ని అన్నీ తానై న‌డుపుతున్నారా అన్న సందేహాలు వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: