హోదా: ఇది..రాష్ట్రానికి అత్యంత ఆవశ్యకమైన విషయం. విభజన సమయంలో అప్పటి ప్రధాని మన్‌మో హన్ సింగ్.. ఏపీకి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే.. తర్వాత.. వచ్చిన మోడీ ప్రభుత్వం దీనిని పక్కన పెట్టిందని.. అటక ఎక్కించిందని.. అందరూ అనుకు న్నారు. ఇప్పటికీ.. అనుకుంటున్నారు. కానీ, తాజాగా కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన విషయాన్ని వెల్లడిం చింది. ``నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తమకు ప్రత్యేక హోదా అవసరం లేదని.. ప్యాకేజీ చాల ని చెప్పినందునే.. దీనిని అమలు చేస్తున్నాం`` అని పేర్కొనడం గమనార్హం.
పోలవరం: ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి నెలకొం ది. అయితే.. దీనిపైనా కొన్ని ప్రచారాలు సాగుతున్నాయి. కేంద్రం పట్టించుకోవడం లేదని.. అందుకే తాము ఇబ్బందులు పడుతున్నామని.. ప్రస్తుత ఏపీ సర్కారు చెబుతోంది. కానీ, వాస్తవం.. తాజాగా కేంద్ర జలశక్తి మంత్రి వెల్లడించారు. గత చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రం పనిచేయాల్సిన అవసరం లేదని.. డబ్బులు ఇస్తే.. చాలని తీర్మానం చేసి పంపిందని.. అందుకే.. తాము డబ్బులు ఇస్తున్నామని.. అయితే.. ఎప్పటికప్పుడు లెక్కలు చూపాల్సి ఉంటుందని.. వెల్లడించారు.
529 కోట్లు: రాష్ట్రం పరిస్థితి అసలే ఇబ్బందిగా ఉంది. ఎక్కడికక్కడ.. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో కేంద్రం ఇచ్చే ప్రతిరూపాయినీ సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఏపీపై ఉంటుంది. కానీ, పద్నాలుగో ఆర్థిక సంఘం కాలంలో ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థలు రూ.529.96 కోట్లను కోల్పోయాయి. 2015-16 నుంచి 2019-20 మధ్యకాలంలో స్థానిక సంస్థలకు రూ.8,654.09 కోట్లను కేటాయించగా చివరకు రూ.8,124.13 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయమంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ లోక్‌సభలో చెప్పారు. అంటే ఇది బాబు నిర్వాకమే! సో.. ఇలా చెప్పుకొంటూ.. పోతే విజన్ ఉన్న నాయకుడి వల్ల ఏపీ లాభపడిందా? నష్టపోయిందా? అనేది ఆలోచించాల్సిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి