ప్రజలందరినీ బానిసలుగా చూస్తూ కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వస్తున్నారు. ఇక మరోవైపు అటు మహిళలను అయితే కేవలం సెక్స్ బానిసలుగా మాత్రమే చూస్తూ దారుణంగా వ్యవహరిస్తున్నారు. అయితే కేవలం ప్రభుత్వంలో మాత్రమే కాదు ఆర్మీ లో కూడా ప్రస్తుతం తాలిబన్లు ఉండటం గమనార్హం. ప్రస్తుతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పాలన సాగిస్తున్న తాలిబన్లు ఇక ఇప్పుడు తమ కోసం ఒక ప్రత్యేకమైన ఆర్మీ ని సిద్ధం చేసుకునేందుకు రెడీ అవుతుంది అన్న విషయం ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. సాధారణంగా ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడుల గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది.
శరీరం మొత్తం బాంబులు చుట్టుకొని ఆత్మహత్యకు పాల్పడుతూ మారణహోమం సృష్టిస్తూ ఉంటారు ఎంతో మంది ఉగ్రవాదులు. అయితే ఇక ఇలాంటి వారిని తాలిబన్లు వీరోచిత సైనికులుగా గుర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో తమ సైన్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇక ఇలాంటి ఆత్మాహుతికి పాల్పడేందుకు కొంతమంది సైనికులను తాలిబన్ ప్రభుత్వం తయారు చేస్తున్నట్లు ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. దీనినే తాలిబన్ల అద్భుత దళం అంటూ త్వరలో ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారట. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి