సంక్రాంతి రోజుల్లో కూడా వివాదాలు అయితే ఆగ‌లేదు.ప‌ల్నాడు ప్రాంతంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల కార‌ణంగా ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్నాయి. టీడీపీ,వైసీపీ మ‌ధ్య రేగిన ఈ ర‌గ‌డ ఇప్ప‌ట్లో చ‌ల్లారేలా లేదు.జొన్న‌ల‌గ‌డ్డ గ్రామంలో రేగిన ఈ వివాదం పై ఇప్ప‌టికే ఇరు వ‌ర్గాలూ కొట్టుకుంటున్నాయి.ప‌రిస్థితి శ్రుతి మించ‌డంతో ఎమ్మెల్యే గోపిరెడ్డి (న‌ర‌స‌రావు పేట‌) ఇంకా ఇంకొంద‌రు త‌మ మాట నెగ్గించుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.మ‌రోవైపు సీన్ లోకిచంద్ర‌బాబు రానున్నారు.
ఇక వివాదం ఎటు పోనుందో మ‌రి!
 
టీడీపీ రాజ‌కీయాల‌కు, వైసీపీ రాజకీయాల‌కు పెద్ద‌గా తేడా ఏం లేదు కానీ.. ప‌ల్నాడు మాత్రం  ఎప్ప‌టి క‌న్నా ఎక్కువ గానే ద‌ద్ద‌రిల్లిపోతోంది.వైఎస్సార్ విగ్ర‌హం చుట్టూ ఇక్క‌డ రాజ‌కీయాలు జ‌రుగుతుండ‌డంతో ఏ క్ష‌ణాన ఏం జ‌రిగినా నియంత్రించే స్థాయిలో పోలీసులు లేరు.ఇక్క‌డ వైఎస్ విగ్ర‌హం మాయం అయింద‌న్న వార్త శుక్ర‌వారం వెలుగు చూసింది.అప్ప‌టి నుంచి రెండు పార్టీలూ బాహాబాహీకి దిగుతున్నాయి.శుక్ర‌వారం వైసీపీ గొడ‌వ చేస్తే, శ‌నివారం టీడీపీ గొడ‌వ చేసింది.మొత్తానికి పోలీసులు చొరవ తీసుకుని నియంత్రిద్దాం అని చూసినా కూడా టీడీపీ లీడ‌ర్ చ‌ద‌ల‌వాడ అర‌వింద రావు ఈ గొడ‌వ‌లో భాగంగా ఇరువ‌ర్గాల‌కు మ‌ధ్య జ‌రిగిన తోపులాట లో అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దీంతో ఆయ‌న‌ను ప్ర‌యివేటు ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా సంబంధిత అంబులెన్స్ పై కూడా గుర్తు తెలియ‌ని దుండ‌గులు రాళ్ల‌తో దాడులు చేశారు.దీంతో స‌మ‌స్య మ‌రింత జ‌ఠిలం అయింది.

ఈ నేప‌థ్యంలో ఈ త‌రుణంలో..ప‌ల్నాడు రాజకీయాలు మ‌ళ్లీ భ‌గ్గు మ‌న్నాయి.గుంటూరు జిల్లా, న‌ర‌స‌రావు పేట, జొన్న‌ల‌గ‌డ్డ గ్రామంలో ఎవ‌రో కొంద‌రు దుండ‌గులు చేసిన ప‌ని రెండు పార్టీల మ‌ధ్య అల్ల‌ర్ల‌కు కార‌ణం అయింది.వైఎస్ విగ్ర‌హం అప‌హ‌ర‌ణ‌కు సంబంధించి జ‌రుగుతున్న ఈ ర‌గ‌డ‌లో అటు వైసీపీ ఇటు టీడీపీ బాహాబాహీకి దిగుతోంది. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఇద్ద‌రు టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు.దీనిపై టీడీపీ భ‌గ్గు మంటూ అరెస్టు చేసిన కార్య‌క‌ర్త‌ల‌ను న‌ర‌స‌రావు పేట ప‌రిధిలో కాకుండా ఇంకెక్క‌డో విచారించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తూ.. సంబంధిత నాయ‌కులు రోడ్డెక్కారు.దీంతో గుంటూరు - క‌ర్నూలు రోడ్డు ఉద్రిక్త‌త‌ల‌కు నిల‌యంగా మారింది.ఎమ్మెల్యే గోపిరెడ్డికి,టీడీపీ లీడ‌ర్ చ‌ద‌ల‌వాడ అర‌వింద‌రావుకు వివాదం తీవ్ర స్థాయిలో న‌డుస్తున్నందున ఏ క్ష‌ణాన ఏం జ‌రుగుతుందో అన్న టెన్ష‌న్ లో పోలీసులు ఉన్నారు.వ‌రుస ఘ‌ట‌న‌ల‌తో శుక్ర‌,శ‌నివారాల్లో ఉద్రిక్త‌త తారా స్థాయికి చేరుకుంది. దీనిపై టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా సీరియ‌స్ అయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: