గత కొంతకాలం నుంచి రష్యా వ్యవహరిస్తున్న తీరు రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోతుంది. ప్రస్తుతం చైనా పొరుగున ఉన్న తైవాన్ ను స్వాధీనం చేసుకొని తమ దేశంలో కలుపుకోవాలి అనుకుంటున్నట్లు గానే చైనా మిత్ర దేశమైన రష్యా కూడా పొరుగున ఉన్న చిన్న దేశం అయిన ఉక్రెయిన్ పై ఆధిపత్యం సాధించడానికి గత కొన్ని రోజుల నుంచి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఉక్రెయిన్ కు మేము అండగా ఉన్నాము అంటూ అగ్రరాజ్యమైన అమెరికా చెబుతున్నప్పటికీ రష్యా మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ప్రస్తుతం రష్యా ఉక్రేయిన్ సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఏ క్షణంలోనైనా సరిహద్దుల్లో యుద్ధం తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇలాంటి యుద్ధం తలెత్తితే.. అటు ఉక్రెయిన్ కు ఆయుధ సహకారం అందించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. పరిస్థితులు చేయి దాటితే స్వయంగా ఉక్రెయిన్ తరపున అమెరికా యుద్ధం చేసే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం మూడవ ప్రపంచ యుద్ధానికి ఇది దారితీస్తుంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 ముఖ్యంగా ఇప్పటివరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం కూడా రావడానికి పెద్ద కారణాలు ఏమీ లేవని.. చిన్న కారణాలే సరైన చర్చలు లేకపోవడం కారణంగానే  యుద్ధానికి పరిస్థితులు దారితీశాయి  అని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు రష్యా తీరు కూడా మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే రష్యా అమెరికా విదేశాంగ శాఖ మంత్రుల చర్చలు జరిగగా విఫలమయ్యాయి. ఇక రష్యా అమెరికా అధ్యక్షులు  కూడా స్వయంగా చర్చలు జరిపారు. అవి సక్సెస్ కాలేదు. ఇటీవలే నాటో అధికారులు రష్యాతో చర్చ జరపగా అవి కూడా సక్సెస్ కాలేదు. దీంతో యుద్ధం ఎక్కడ ప్రారంభం అవుతుందో కూడా తెలియని విధంగా ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది అని అంటున్నారు విశ్లేషకులు. దీంతో పరిస్థితులు ఎక్కడి వరకు దారి తీస్తాయన్నది ఊహకందని విధంగా ఉంది అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: