తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు కరోనా కేసుల పై కీలక ప్రకటన చేశారు. ఓమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ ...వ్యాధి లక్షణాలు తక్కువ అని స్పష్టం చేశారు ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు.  టెస్ట్ కిట్లు,రెమిడిసివర్ ఇంజెక్షన్ లు,ఆక్సిజన్,హోమ్ ఐసోలేషన్ కిట్ లు అందుబాటులో ఉన్నాయన్నారు. కరోనా విషయం లో ఎవరు కూడా ఆందోళన చెందనవసరం లేదని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం నుండి అనేక మంది మంత్రులుగా పని చేసి వలసల జిల్లాగా మార్చారు...కాంగ్రెస్,టీడీపీ వాళ్ళు లక్షలాది మంది వలసలకు కారణం అయ్యారని ఫైర్ అయ్యారు ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు. కేంద్రం తెలంగాణ  కు ఒక్కటి కూడా మెడికల్ కాలేజి ఇవ్వలేదు.. వైద్య రంగం లో నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంక్ లో తెలంగాణ మూడో స్థానం లో ఉందన్నారు ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు.  బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ చివరి స్థానంలో ఉంది.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు.  

అన్ని స్కూళ్లలో మౌళిక వసతుల కల్పన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు... బీజేపీ పార్టీలది  గోబెల్స్ ప్రచారం తప్ప పని ఉండదని పేర్కొన్నారు ఆరోగ్య శాఖ మంత్రి  హరీష్ రావు.. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..  బాలానగర్ తండా ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడేవారు..అంబులెన్స్ రాక ఎంతోమంది చనిపోయిన పరిస్థితి ఉండేదన్నారు. కార్పొరేట్ స్థాయి వైద్యం తండా ప్రజలకు అందుతుంది.... ముప్పై పడకల ఆసుపత్రి తో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. సీఎం కేసీఆర్ తండాలు గ్రామ పంచాయతీలు చేశారు...తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు తరువాత ప్రతి ఇంటికి సంక్షేమం అందుతుందని పేర్కొన్నారు.  తెలంగాణ అభివృద్ధి చూసి పక్క రాష్ట్రం ప్రజలు తెలంగాణ లో కలపండి అని అడుగుతున్నారు..తెలంగాణ అభివృద్ధి ఎవరివల్ల జరిగిందో ప్రజలు గమనించాలన్నారు.  ఎట్లా వుండే వాళ్ళం ఎలా అయ్యాము.ప్రజలందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి..జాతీయ పార్టీ లు మనం చేపట్టిన కార్యక్రమాలు చేయలేవని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: