తెలుగులో ఇంగ్లీష్ పాలిటిక్స్...ఇదేంది వెరైటీగా ఉంది..పైగా మూడు సబ్జెక్ట్‌లు ఉన్నాయని డౌట్ రావొచ్చు...తెలుగు, ఇంగ్లీష్‌లతో పాటు పాలిటిక్స్ సబ్జెక్ట్ కనిపిస్తుందని అనుకోవచ్చు. అయితే ఇదంతా చదువుకు సంబంధించిన రాజకీయం...ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియంపై రాజకీయం నడుస్తోంది. అయితే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు...పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యాయి.

అయితే ఏపీలో జగన్ ప్రభుత్వం ఎప్పుడో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి సిద్ధమైంది. కానీ దీని ప్రతిపక్ష టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించింది. అలాగే దీనిపై కోర్టులో కేసులు కూడా పడ్డాయి. దీంతో పేదలకు ఇంగ్లీష్ మీడియం అందిస్తామంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని వైసీపీ నేతలు, టీడీపీపై ఫైర్ అవుతూ వస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం సైతం...ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకుంది.

ఇక దీనిపై టీడీపీ గాని, టీడీపీ అనుకూల మీడియా గాని వ్యతిరేకంగా లేదు. పైగా కేసీఆర్ నిర్ణయాన్ని టీడీపీ అనుకూల మీడియా సమర్ధించింది. అదేంటి జగన్ తీసుకుంటే తప్పు అన్నారు...కేసీఆర్ చేస్తే ఒప్పు అంటున్నారు..ఏంటి ఈ యెల్లో మీడియా రాతలు అని వైసీపీ అనుకూల మీడియా ఫైర్ అవుతుంది. అటు వైసీపీ మంత్రులు, నేతలు కూడా టీడీపీ వైఖరిపై ఫైర్ అవుతున్నారు. అవును వైసీపీ వర్షన్ చూస్తే నిజమే కదా అని అనిపిస్తుంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది...తెలంగాణలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతూనే...తెలుగు మీడియంని కంటిన్యూ చేయనున్నారు.

కానీ ఏపీలో అలా కాదు పూర్తిగా ఇంగ్లీష్ మీడియమే...పైగా తెలుగు సబ్జెక్ట్ ఉంటుందని అంటున్నారు. తెలుగు సబ్జెక్ట్‌కు, తెలుగు మీడియంకు చాలా తేడా ఉంది..ఆ లాజిక్ అందరికీ అర్ధమవుతుంది. టీడీపీ నేతలు అడిగేది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం పెట్టండి...కానీ తెలుగు మీడియంని కూడా కొనసాగించమంటున్నారు. ఇక దీనికి వైసీపీ వేరే అర్ధాలు వెతుక్కుంటూ...టీడీపీ నేతలే అడ్డుపడుతున్నారని ప్రచారం చేస్తున్నారు. మొత్తానికైతే వైసీపీ ఫ్యాన్స్ చిన్న లాజిక్ మిస్ అయ్యారని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: