ఒకప్పుడు స్మగ్లర్లు కేవలం మాదక ద్రవ్యాలు నిషేధిత మత్తు పదార్థాలను మాత్రమే స్మగ్లింగ్ చేసే వారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం స్మగ్లర్లు అది ఇది అని తేడా లేదు దేన్నీ వదలడం లేదు. కేవలం మాదకద్రవ్యాలను మాత్రమే కాదు కొన్ని రకాల జీవాలను కూడా స్మగ్లింగ్ చేస్తూ ఉండటం గమనార్హం. గతంలో రెండు తలల పాములు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వారు ఎంతోమంది. అయితే రెండు తలల పాము అమ్మితే  రూపాయలు వస్తాయని ఎంతోమంది నమ్ముతుంటారు. ఈ క్రమంలోనే రెండు తలల పాము ని వెతికి మరీ పట్టుకొని  పోలీసుల కళ్లుగప్పి  స్మగ్లింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.



 ఇలా ఇటీవలి కాలంలో ఎప్పుడూ ఏదో కొత్త స్మగ్లింగ్ తెరమీదికి వస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొత్తరకం స్మగ్లింగ్ వెలుగులోకి వచ్చి అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. సాధారణంగా రాబందులు ఎలా ఉంటాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. నలుపురంగులో కనిపిస్తూ ఉంటాయి. అంతేకాదు రాబందులు అశుభానికి సూచికగా కూడా ఎంతో మంది భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు అందరికీ తెలిసిన  రాబందులు కాదు ఏకంగా తెల్ల రాబందుల స్మగ్లింగ్ ఇటీవల వెలుగులోకి వచ్చింది. తెల్ల రాబందుల్లో కూడా తెలుపు నలుపు అనే రెండు రకాలు ఉంటాయట. తెల్ల రాబందులను ఇంటి ముందు పాతిపెడితే ఎంతో మంచి జరుగుతుందని ప్రచారం ఉందట.తెల్ల రాబందులను తింటే ఆ కొన్ని రకాల రోగాలను కూడా నయం అవుతాయని ఆరోగ్యంగా మారిపోతారని అపోహలు కూడా ఉన్నాయట.



 ఈ క్రమంలోనే ఇటీవల తెల్ల రాబందులను స్మగ్లింగ్ చేస్తున్న కొందరు అక్రమార్కులు పోలీసులు పట్టుకున్నారు. ఇక వారిని విచారించగా చెప్పిన విషయాలతో పోలీసులు షాక్ అయ్యారు అని చెప్పాలి.  మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా రైల్వే స్టేషన్లు తెల్ల రాబందులను స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. సుల్తాన్పూర్ లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ లో బ్యాగ్ లో కొన్ని పక్షులను తీసుకెళ్తున్నారు అంటూ రైల్వే పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఇద్దరు వ్యక్తుల  నుంచి ఏడు తెలుపు రంగు రాబందులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే భారత్లో అంతరించిపోయిన ఈ రకం రాబందులు స్మగ్లర్లకు ఎక్కడినుంచి వచ్చాయి అన్నది ప్రస్తుతం ప్రశ్నగా మారి పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: