ఒక్క కరోనా వైరస్ మన జీవితాలను మరియు మన భవిష్యత్తును ప్రశ్నించుకునేలా చేసింది. 2019 లో వచ్చిన ఈ కరోనా వైరస్ అనేక విధాలుగా ఇబ్బందులను పెట్టింది. మన మధ్యన తిరుగుతూ సంతోషంగా ఉండే ఎందరినో బలి తీసుకుంది. ఈ కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా విద్యా సంస్థలు, పరిశ్రమలు అన్నీ మూతబడ్డాయి. అయితే విద్యాసంస్థలు మూతబడ్డాయి కదా అని పిల్లల చదువులను గాలికి వదిలి వేయలేము కదా? అందుకే ప్రభుత్వాలు కూడా బాగా ఆలోచించి స్కూల్ యాజమాన్యాలను ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

అలా ప్రతి రాష్ట్రంలో ఆన్ లైన్ క్లాస్ లు మొదలు అయ్యాయి. అయితే కొన్ని విద్యాసంస్థలు మాత్రం కరోనా సమయంలో క్లాస్ లు లేకున్నా, ఆన్ లైన్ క్లాస్ లు చెప్పకున్నా ఫీజులు తప్పక కట్టాలని పిల్లల తల్లితండ్రులను వేధించి వసూలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పవచ్చు. ఇప్పుడు ఇలాంటి సమస్య ఒకటి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ ఘట్ కేసర్ ప్రాంతంలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు తరగతులు పెట్టుకున్నా ఫీజులు గుంజుతున్నారు అని సమాచారం. అంతే కాకుండా గతంలో ఉన్న ఫీజుల కన్నా కూడా అధిక ఫీజుల కోసం  వేధిస్తున్నారని ఒక విద్యార్థి తండ్రి ట్వీట్ ద్వారా తన ఆవేదనను తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ను టాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. అందులో ఇలా తన బాధను వివరించాడు. "గౌరవనీయులైన మంత్రి గారికి హైదరాబాద్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం వేధింపులు ఎక్కువయ్యాయి అంటూ చెప్పుకొచ్చారు. స్కూల్స్ ఈ మధ్యనే ఓపెన్ చేసినా అప్పటి నుండి ఫీజులు చెల్లించాలని రోజూ వేదిస్తున్నట్లు తెలిపాడు.

ఆన్లైన్ క్లాస్ ల సమయంలో కూడా ఫీజులు చెల్లించామని, కానీ ఇప్పుడు మిగిలిన ఫీజు చెల్లిస్తేనే పరీక్షలు రాయవచ్చు అని ఇబ్బందులు పెడుతున్నారు అంటూ ఆవేదనను వెళ్లగక్కారు. ఎలాగైనా మా సమస్యను అర్థం చేసుకుని తగిన న్యాయం చెయ్యాలని కోరారు. మరి ఈ విషయంపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: