ఏంటో ఈ మధ్య జగన్‌కు అంత అనుకూలంగా రాజకీయం నడుస్తున్నట్లు కనిపించడం లేదు..ప్రతిదీ ఆయనకు నెగిటివ్ అయ్యేలా కనిపిస్తోంది..ఏదో అధికారం ఉంది కాబట్టి...ఆ బలంతో కాస్త ఇబ్బందులు పెద్దగా కనబడటం లేదు గాని...లేదంటే ఇప్పుడున్న నెగిటివ్ పరిస్తితులు జగన్‌కు రాజకీయంగా చాలా ఇబ్బంది అయ్యేవని చెప్పొచ్చు. అసలు అన్నివైపుల నుంచి జగన్‌పై వ్యతిరేకతే ఉన్నట్లు కనిపిస్తోంది.

అంటే ప్రతిపక్ష టీడీపీ, దాని అనుకూల మీడియా చేసే ప్రచారం వల్ల అలా ఉందా? లేక నిజంగా జగన్ ప్రభుత్వంపైన వ్యతిరేకత ఉందని అంశంలో ఏ మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ ఏదేమైనా జగన్ ప్రభుత్వంపై మాత్రం పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తోంది...ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది...అలాగే మంత్రుల పనితీరు ఏమి గొప్పగా లేదు..వారు ఏ టైమ్‌లో ఏం మాట్లాడుతారో అర్ధం కాకుండా ఉంది..మరోవైపు ప్రతిపక్ష టీడీపీ చేసే నెగిటివ్ ప్రచారం బాగా ఇబ్బంది అవుతుంది..అలాగే ఆ పార్టీ రోజురోజుకూ బలపడటం జగన్‌కు మైనస్.  

అదే సమయంలో జగన్ ప్రభుత్వం చేసే అభివృద్ధి కూడా ఏమి కనిపించడం లేదు..అదేవిధంగా ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకోవడం కూడా ప్లస్ అవ్వడం లేదు. ఇక ప్రతిపక్ష టీడీపీని రాజకీయ కక్షతో తోక్కేస్తున్నట్లు కనిపించడం పెద్ద మైనస్ అవుతుంది..చివరికి వైఎస్ వివేకా హత్య కేసు సైతం జగన్‌కే నెగిటివ్ అయ్యేలా కనిపిస్తోంది...ఇలా అన్నిరకాలుగా జగన్ ప్రభుత్వానికి నెగిటివ్ కనిపిస్తోంది.

కాబట్టి ఈ పరిస్తితుల నుంచి జగన్ బయటపడాల్సి ఉంది....ఇక ఇలాంటి టైమ్‌లో జగన్‌కు ఉన్న ఏకైక ఆశ...పథకాల లబ్దిదారులు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎలాంటి పరిస్తితులు ఉన్నా సరే జగన్ సంక్షేమ పథకాల అమలు ఆపలేదు...పథకాలు అందిస్తూనే ఉన్నారు. ఇలా పథకాలు ఇస్తున్నారు కాబట్టి..వారే కాస్త జగన్ పట్ల పాజిటివ్‌గా ఉన్నారని చెప్పొచ్చు...ఇక వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే వాళ్లపైనే భారమంతా ఉందని చెప్పొచ్చు. చూడాలి మరి పథకాలు జగన్‌ని కాపాడతాయో లేదో.  

మరింత సమాచారం తెలుసుకోండి: