ఏపీలో నాటుసారా జే బ్యాండ్ మద్యాన్ని నిషేధించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆందోళనకు దిగింది. మద్యపానాన్ని నిషేధించాలని కోరుతూ ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేశాయి. అలాగే అసెంబ్లీ వేదికగా టిడిపి ఎమ్మెల్యేలు చేసినటువంటి పోరాటానికి,మద్దతు గ్రామస్థాయి నుంచి లభిస్తోంది.

 నెల్లూరులో టిడిపి ఆందోళన సీఎం జగన్ పై మండిపాటు..!
 రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఆందోళనలు కొనసాగు తున్నాయి. నెల్లూరు జిల్లాలో నాసిరకం మద్యాన్ని తాగి పేద ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని టిడిపి నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలు పేరుతో 9 రకాల నాసిరకం మద్యాన్ని తీసుకువచ్చారని మండిపడ్డారు. అలాగే అధిక ధరలకు మద్యంన్ని అమ్ముతూ పేదలను జగన్ దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 విజయనగరంలో టిడిపి ఆందోళన ఉద్రిక్తత..!
 విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో కల్తీ మద్యం పై నిరసన తెలియ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు చెదరగొట్టి అరెస్టు చేశారు. సారా మహమ్మారికి నిరసనగా సర్కారు తీరుపై ర్యాలీ చేపట్టినటువంటి టిడిపి నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులకు మరియు టిడిపి నాయకుల మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

 తూర్పుగోదావరి జిల్లాలో నిరసన ర్యాలీ..!
 తూర్పుగోదావరి జిల్లా మోరంపూడి జంక్షన్ వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధర్నాను  చేపట్టాయి. ఈ యొక్క ధర్నాలో  ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కూడా పాల్గొన్నారు. కల్తీ సారా విక్రయాలను అలాగే జి బ్రాండ్ మద్యాన్ని నిషేధించాలని కోరుతూ తెలుగుతమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు.

 తాళిబొట్టు చేతిలో పట్టుకొని నిమ్మల రామానాయుడు నిరసన..!
 ప్రభుత్వం అమ్మ ఒడి పెట్టి,జే బ్రాండ్తో నాన్న లేకుండా చేస్తోందని ముఖ్యమంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు టిడిపి నేతలు. మహిళలు తాళి బొట్టుతో నిరసన వ్యక్తం చేశారు. జగన్ యొక్క ధన దాహానికి తాళిబొట్లు తాకట్టు పెట్టడమే కాకుండా అవి తెగిపోతున్నాయి అని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: