రానున్న అక్టోబర్లో వచ్చే విజయదశమి నాడు తిరుపతి నుండి జనసేన అధినేత పవన్ కల్యాణ్ యాత్ర మొదలుపెట్టబోతున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి బస్సుయాత్ర కానీ లేదా పాదయాత్ర చేయాలని కానీ పవన్ కు అసలు లేనేలేదు. అలాంటిది ఇంత హఠాత్తుగా బస్సుయాత్రను పవన్ ఎందుకు ప్రకటించారు ? ఎందుకంటే మిత్రపక్షం బీజేపీ, పొత్తు ఖరారవుతుందని అనుకుంటున్న టీడీపీకి వార్నింగ్ ఇవ్వటమే పవన్ హిడెన్ అజెండా అనుకుంటున్నారు.






వార్నింగ్ ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటే పవన్ మూడు ఆప్షన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ ప్రకటించిన మూడు ఆప్షన్లను పై రెండు పార్టీల నేతలు లెక్కచేయకపోగా పవన్ను తీసిపారేసినట్లు మాట్లాడారు. ఇక్కడే పవన్ ఇగో హర్టయ్యిందట. అందుకనే వాటికి తనసత్తా ఏమిటో చూపించాలంటే తనకున్న ఏకైక మార్గం యాత్రమాత్రమే. చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో జనాలు వస్తున్నారని, మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందనే జోష్ లో ఉన్నారు. కాబట్టి పవన్ తో పొత్తు అవసరంలేదన్నట్లుగా తమ్ముళ్ళు మాట్లాడుతున్నారు.






ఇక బీజేపీకి ఒక్కశాతం ఓటు లేకపోయినా తనను ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించేందుకు కమలనాదులు ఇష్టపడకపోవటాన్ని పవన్ అవమానంగా భావించారట. అందుకనే ఏకకాలంలో రెండుపార్టీలకు యాత్రద్వారా తనసత్తా ఏమిటో చూపించాలన్న ఆలోచనతోనే బస్సుయాత్ర పెట్టుకున్నారు. ఒకపుడు తాను యాత్రల పేరుతో జనాల్లోకి వస్తే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ వస్తుందని స్వయంగా పవనే చెప్పారు. అందుకనే తాను యాత్రలు చేయటంలేదని కూడా అప్పట్లో చెప్పారు.






అలాంటిది ఆ విషయాన్ని మరచిపోయి తానే బస్సుయాత్రకు రెడీ అవుతున్నారంటే రెండుపార్టీలపై ఎంతగా మండిపోతున్నారో అర్ధమవుతోంది. మరీ యాత్రతో జనసేన గ్రాఫ్ పెరుగుతుందా ? పై రెండుపార్టీలు పవన్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందిస్తాయా అన్నదే ఆసక్తిగా మారింది. ఒకవేళ అప్పుడు కూడా పై రెండుపార్టీలు సానుకూలంగా స్పందించకపోతే పవన్ ఏమిచేస్తారు ? ఆ సమాధానం కోసం వెయిట్ చేయాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: