సాధారణం గా పెళ్లి బంధంతో ఒక్కటైన తర్వాత భార్యపై ఆధిపత్యం చెలాయించాలని భర్తలు భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఏ చిన్న పని చేసినా తనకు చెప్పి చేయాలని ఒత్తిడి తీసుకు వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా పెళ్లి జరిగిన వెంటనే ఏకంగా భార్య స్వేచ్ఛకు  పూర్తిగా భంగం కలిగించేలా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే పెళ్లి జరిగిన తర్వాత ఇక భార్యపై భర్తకు అన్ని రకాల హక్కులు ఉంటాయి అని కొంతమంది పెద్దలు చెబు తున్నారు. ఇటీవలి కాలంలో భార్యపై భర్తకు.. భర్తపై భార్యకు ఎలాంటి హక్కులు ఉంటాయి అన్న విషయంపై హైకోర్టు ఆసక్తికర విషయాలను చెబుతున్నాయి అన్న విషయం తెలిసిందే.


 ఇటీవలే పలు ఆసక్తికర కేసులు కోర్టు మెట్లు ఎక్కుతూ ఉండగా ఈ కేసుల విచారణలో భాగంగా షాకింగ్ తీర్పులు వెల్లడిస్తున్నాయి న్యాయస్థానాలు. ఇక్కడ ఇలాంటి తరహా తీర్పు రావడంతో ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల కాలంలో ఎంతోమంది అవయవ దానం చేసేందుకు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. తాము చనిపోయిన తర్వాత పది మందికి ప్రాణం పోయాలని ఉద్దేశ్యంతో ఇక అవయవ దానం చేస్తూ ఎంతో మందికి పునర్జన్మను ఇస్తున్నారు. అదే సమయంలో సొంత వాళ్లకు సమస్య వచ్చినా అవయవ దానం చేసేందుకు రెడీ అవుతున్నారు.  ఇలాంటి సమయంలో పెళ్లైన మహిళలకు అవయవదానం చేసేందుకు అటు భర్తలు అంగీకారం ఇవ్వకపోవడం గమనార్హం.



 అయితే ఇటీవలే ఓ వివాహిత అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి  కిడ్నీ దానం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకు భర్త అంగీకరించలేదు. అయితే ఆసుపత్రి వర్గాలు ఈ శస్త్ర చికిత్స చేసేందుకు భర్త అంగీకారం తెలిపినట్లు ధ్రువీకరణ పత్రం కావాలని కోరారు. దీంతో సదరు మహిళ కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది. అయితే ఈ కేసుపై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు పెళ్ళైన మహిళ అవయవ దానం చేయడానికి ఆమె భర్త అంగీకారం అవసరం లేదు అంటూ స్పష్టం చేసింది. భర్త అనుమతి కోరితే మహిళ తన సొంత శరీరం పై హక్కు కోల్పోయినట్లే అవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ తీర్పు హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: