విధి రాత అనేది అందరి విషయంలో ఒకేలా ఉండదు. ఈక్రమంలోనే బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయి అన్నది ఎంతో మంది విషయంలో నిరూపితమవుతుంది. సామాన్య స్థాయి నుంచి కొంతమంది  సంపన్నులుగా మారిపోతూ ఉంటే.. మరి కొంతమంది  సంపన్నులుగా ఉండి ఎన్నో ఆస్తులు కలిగిన వారు అన్నీ కోల్పోయి దుర్భర జీవితాన్ని గడపడం లాంటివి కూడా ఎంతోమంది విషయంలో ఇప్పటికే జరిగింది.  కొన్ని కొన్ని సార్లు ఎన్నో గొప్ప లక్ష్యాలను పెట్టుకొని సాగుతూ ఉన్నప్పటికీ విధి పెట్టిన పరీక్షలో తలవంచి చివరికి బతుకు పోరాటం కోసం రాజీ పడటం లాంటివి చేస్తూ ఉంటారు  ఇప్పుడు మనం మాట్లాడుతూ బోయేది కూడా ఇలాంటి యువకుడు గురించి అని చెప్పాలి.


 విధి పెట్టిన పరీక్షలో అతను ఓడిపోయాడు. చివరికి అనుకున్నది సాధించలేక ఇప్పుడు బ్రతుకు బండిని ముందుకు నడిపించేందుకు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. మధ్యప్రదేశ్  కు చెందిన వైభవ్ అనే యువకుడు ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఇతని బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్న స్థానికులు అవాక్కవుతున్నారు. వైభవ్ ఆరేళ్లుగా బేస్బాల్ ఆడుతున్నాడు. ఉత్తమ ప్రతిభ చాటడంతో అనతికాలంలోనే ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఇక మధ్యప్రదేశ్లో బేస్బాల్ జట్టుకు 20 సార్లు ప్రాతినిధ్యం వహించాడు.


 కానీ అంతలోనే కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దీంతో అతనికి ఎటువైపు నుంచి మద్దతు లభించలేదు. దీంతో అతని ఆట కు బ్రేక్ పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక బేస్బాల్ ఆటకు దూరమై మూడు నెలల క్రితం నోయిడాకు వచ్చి సెక్యూరిటీ గార్డు  గా పని చేస్తూ ఉన్నాడు. తన లక్ష్యం కోసం ముందుకు సాగి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక  ఇక సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం తప్పడం లేదు అంటూ చెబుతున్నాడు. అయితే 12వ తరగతి వరకు మాత్రమే చదవడం మంచి ఉద్యోగం రాలేదు అని చెబుతున్నాడు. అయితే ఒక వైపు సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న ఖాళీ సమయం దొరికినప్పుడు బేస్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నాను అంటూ చెబుతున్నాడు సదరు యువకుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: