ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నా అభివృద్ధి ఏమాత్రం లేదని నిత్యం ప్రతిపక్ష నాయకులు సీఎం జగన్ పై మరియు వైసీపీ నాయకులపై విరుచుకుపడుతున్నారు. అయితే అభివృద్ధి లేదు అన్నది వాస్తవం కాకపోలేదు.. కానీ సీఎం జగన్ రాష్ట్రానికి కొత్త కంపెనీలను తీసుకురావడానికి తన ప్రయత్నం చేస్తున్నాడు. కొన్ని అంశాలను టార్గెట్ చేసుకుని నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడానికి ప్రతిపక్షాలు తయారవుతున్నాయి. ఇక సీఎం జగన్ కూడా ఈసారి ఎన్నికల కోసం ఇప్పయిట్ నుండే పార్టీని దగ్గరుండి మరీ పటిష్టం చేస్తున్నారు. గతంలో వచ్చిన సీట్లు కన్నా ఎక్కువ వచ్చేందుకు కృషి చెయ్యాలని నాయకులకు సూచించాడు.

కాగా ఎన్నికల కన్నా ముందే పార్టీ గురించి ప్రభుత్వం గురించి ప్రజలు ఏమి ఆలోచిస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకునేందుకు ముందస్తుగా ఒక సర్వే ను చేయించాడట జగన్. ఈ సర్వే బాధ్యతను ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తీసుకున్నారు. అయితే సర్వేలో తెలిసిన విషయం జగన్ ను ఒకింత కంగారు పడేలా చేస్తోందట. ఏ రాష్ట్రము అయినా మూడు రకాల వర్గాలు ఉంటాయి. ఒక వర్గం మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా సపోర్ట్ చేస్తూ ఉంటారు... వీరు నాయకులు ఎవరైనా వైసీపీ గుర్తుకే ఓటు వేసి పార్టీ విజయం కోసం కృషి చేస్తారు. ఇలాంటి వారి వలన ఇబ్బంది లేదు. ఇక రెండవ వర్గం ప్రభుత్వానికి వ్యతిరేకం వీరు పార్టీ మంచి చేసినా చెడు చేసినా వ్యతిరేకంగానే ఉంటారు.

ఈ రెండు కూడా ఊహించదగినవే.. అయితే ఇంకో వర్గం తటస్థ ఓటరు. వీరి గురించి ఇప్పుడు కంగారు అంతా... కనీసం సర్వేలో టీం కు సరిగా కూడా సహకరించలేదట. ముఖ్యంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలుస్తోంది. ఒకవేళ మిగిలిన ఈ కాస్త సమయంలో రాష్ట్రంలోని తటస్థ ఓటర్లను బుజ్జగించకపోతే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. మరి జగన్ ఎటువంటి స్టెప్ తీసుకుంటారు అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: