చంద్రబాబునాయుడు మాటలు, చేష్టలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. రూపొందిస్తున్న పార్టీ కార్యక్రమాలు,  ఆ కార్యక్రమాలకు పెడుతున్న పేర్లు,  రోడ్డుషోల్లో మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న చాలెంజులు చూసిన తర్వాత చంద్రబాబులో స్టామినా దెబ్బతినేసిందనే అనుకుంటున్నారు. తనకు తాను ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని కితాబిచ్చుకోవటం, ఎల్లోమీడియాతో చాణుక్యుడని ప్రచారం చేయించుకోవటం మినహా చంద్రబాబులో ఒరిజనాలిటి ఎక్కడా కనబడటంలేదు.

కోట్లరూపాయలు కాంట్రాక్టుతో ప్రత్యేకంగా రాబిన్ శర్మ అనే వ్యూహకర్తను నియమించుకున్నారు. సదరు వ్యూహకర్త ఏమిచేస్తున్నారో ఎవరికీ తెలీదు. వ్యూహకర్తను నియమించుకున్న తర్వాత మూడు ఉపఎన్నికలు జరిగితే అందులో టీడీపీ తిరుపతి పార్లమెంటు ఉపఎన్నికలో తప్ప మిగిలిన రెండు ఉపఎన్నికల్లో పోటీచేయలేదు. పోటీచేసిన తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో కూడా ఫెయిలైంది. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి పాలనపై విపరీతమైన వ్యతిరేకత ఉందని చంద్రబాబే చెబుతున్నారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీకి 160 సీట్లు ఖాయమంటున్నారు. ఇదే నిజమైతే ఇక వ్యూహకర్త అవసరం ఏమిటి ? నిజానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ జనాల్లోకి ఎలా చొచ్చుకునిపోవాలనే విషయంతో పాటు ఏ ఏ అంశాలను టచ్ చేస్తే జనాలు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారో వ్యూహకర్త చంద్రబాబుకు రిపోర్టివ్వాలి. కానీ అలాంటిది జరుగుతున్నట్లు కనబడటంలేదు. ఎందుకంటే మొన్నటివరకు చేసిన బాదుడేబాదుడు కార్యక్రమం అట్టర్ ఫ్లాపయ్యింది. ఈ విషయం పార్టీ వేదికమీద అధికారిక నివేదిక ద్వారానే బయటపడింది. కొత్తగా మొదలుపెట్టబోతున్న ‘ఇదేంఖర్మ’ ప్రోగ్రామ్ మొదలుపెట్టకమునుపు పార్టీలోనే నవ్వుల పాలవుతోంది.


ఇక్కడ సమస్య ఏమిటంటే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చంద్రబాబు ఏ ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారో అవన్నీ తాను అధికారంలో ఉన్నపుడూ ఆచరించినవే. చంద్రబాబు హయాంలో కూడా ధరల పెరుగుదల, అవినీతి, అరాచకాలు, భూక్బాలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు విపరీతంగా ఉండేవి. చంద్రబాబు కూడా అప్పులు చేశారు, కార్పొరేషన్లను తాకట్టుపెట్టేశారు. అప్పుడేవీ బయటపడకుండా ఎల్లోమీడియా మ్యానేజ్ చేసేది. అదే మీడియా ఇపుడు జగన్ కు వ్యతిరేకంగా రోడ్డున పడి నానా గోలచేస్తోందంతే తేడా.  చంద్రబాబులో సొంతంగా ఆలోచించే కెపాసిటి పోయింది కాబట్టే వ్యూహకర్తను పెట్టుకున్నట్లున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: