తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ కమ్ చంద్రబాబునాయుడు బావమరిది కమ్ వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బంపరాఫర్ ఇచ్చారు. ఓటీటీలో తాను నిర్వహిస్తున్న ఒక షోలో భాగంగా పవన్ తో మాట్లాడుతు తెలుగుదేశంపార్టీలో ఎందుకు చేరకూడదని అడిగారు. బాలయ్య నుండి ఇలాంటి ప్రశ్న వస్తుందని పవన్ కు తెలుసో లేదో తెలీదుకానీ జనసేన నేతలకు మాత్రం ఊహించనిదనే చెప్పాలి.

మరి బాలయ్య ప్రశ్నకు పవన్ ఏమి సమాధానం చెప్పారో ఫిబ్రవరి 10వ తేదీన రిలీజయ్యే పూర్తి ఎపిసోడ్ చూస్తేకానీ తెలీదు. ఇప్పటికైతే ప్రోమోలో ఇలాంటి మరో రెండు ప్రశ్నలు ఉన్నాయి. బాలయ్య ఏదో అడగటం పవన్ ఏదో సమాధానం చెప్పటం అందరు వింటున్నదే. విశేషమైన అభిమానులున్న మీకు వాళ్ళంతా ఓట్లుగా ఎందుకు మారటంలేదనే గట్టి ప్రశ్ననే వేశారు. ఇక్కడే పవన్లోని డొల్లతనం బయటపడుతోంది.


అభిమానులుంటే సరిపోదు వాళ్ళని ఓటర్లుగా మలుచుకునేంత కెపాసిటి ఉండాలి కదా. పవన్ కు ఆ కెపాసిటి లేదనే కదా మొదటినుండి గోల జరుగుతోంది. నిజానికి పవనే ఈ విషయంలో గోల పెడుతున్నారు. గోలైతే పెడుతున్నారు కానీ తనలోని లోపాన్ని సరిచేసుకునేందుకు మాత్రం రెడీగాలేరు. అందుకనే అభిమానులను ఓటర్లుగా మలచుకోవటంలో ఫెయిలవుతున్నారు. పార్టీ నిర్మాణమే జరగకపోతే ఇక ఓటర్లు ఎక్కడినుండి వస్తారు ? జనాలను పోలింగ్ కేంద్రాలకు తరలించి ఎవరు ఓట్లేయిస్తారు ?

టీడీపీలో చేరే ప్రశ్నకు పవన్ ఏమని సమాధానం చెప్పారనే ఆసక్తుంది జనాల్లో. అయితే ఇపుడు కొత్తగా పవన్ టీడీపీలో చేరేదేముంది ? ఎప్పటినుండో చంద్రబాబు ప్రయోజనాల కోసమే పవన్ పనిచేస్తున్నారని మంత్రులు, వైసీపీ నేతలు చెబుతున్నారు కదా. గ్రౌండ్ లెవల్లో జరుగుతున్న పరిణామాలు కూడా నిజమనే అనిపిస్తోంది. జనసేన అధినేతగా ఉన్నారు కాబట్టే పవన్ కు ఈ మాత్రమైనా చంద్రబాబు విలువిస్తున్నారు. అదే బాలయ్య చెప్పినట్లుగా టీడీపీలో చేరిపోతే ఇక గుంపులో గోవిందా అన్నట్లుగానే అయిపోతుంది పవన్ పరిస్ధితి. చూద్దాం ఫిబ్రవరి 10వ తేదీన పవన్ సమాధానం ఏమిటో.మరింత సమాచారం తెలుసుకోండి: