ఎల్లోమీడియాకు ప్రముఖ నిర్మాత  దగ్గుబాటి సురేష్ బాబు పెద్ద షాకే ఇచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే స్కిల్ స్కామ్ లో చంద్రబాబునాయుడు అరెస్టయి రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబు అరెస్టయిన దగ్గర నుండి మద్దతుగా ఎల్లోమీడియా పుంఖానుపుంఖాలుగా కథనాలు, వార్తలను వండి వారుస్తున్నది. ఇందులో భాగంగానే ఎవరెవరితోనో ఇంటర్వ్యూలు అచ్చేస్తున్నది. చివరకు ఇదే స్కామ్ లో అరెస్టయి ప్రస్తుతం బెయిల్ మీదున్న సుమన్ బోస్, ఖన్వేల్కర్ ను కూ డా ఇంటర్వ్యూ చేసి చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇప్పిస్తోంది.

పనిలోపనిగా సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులను కూడా చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడమని, ప్రకటనలు ఇవ్వమని బాగా ఒత్తిడి తెస్తున్నట్లు టాక్ వినబడుతోంది. ఒకవైపు ఎల్లోమీడియా మరోవైపు టీడీపీ ప్రముఖులు ఒత్తిడి తెస్తుండటంతో సినీ ప్రముఖులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు అరెస్టయి 10 రోజులవుతున్నా రాఘవేంద్రరావు, అశ్వనీదత్, నట్టికుమార్ తప్ప నాలుగో ప్రముఖుడెవరూ స్పందించలేదు. అశ్వనీదత్, రాఘవేంద్రరావులు సినీ ప్రముఖులుగానే కాకుండా చంద్రబాబుకు కూడా అత్యంత సన్నిహితులని అందరికీ తెలిసిందే. చంద్రబాబుకు మద్దతుగా సురేష్ తో మాట్లాడించాలని ఎల్లోమీడియా ఎంత ప్రయత్నించినా ఆయన ఒప్పకోలేదు. 

చంద్రబాబు అరెస్టవ్వగానే వీళ్ళిద్దరు రెచ్చిపోయి ప్రభుత్వాన్ని నానా మాటలన్నారు. జగన్ను ఎన్ని శాపనార్ధాలుపెట్టారో లెక్కేలేదు. అదే విధంగా మిగిలిన ప్రముఖులు కూడా స్పందించాలన్నది ఎల్లోమీడియా, టీడీపీ కోరిక. అందుకనే ప్రముఖులకు పదేపదే ఫోన్లు చేస్తున్నారట. అయితే ఈ విషయంలో దగ్గుబాటి సురేష్ మాట్లాడుతు చంద్రబాబు అరెస్టుమీద సినిమా వాళ్ళు స్పందించకుండ ఉంటేనే మంచిదన్నారు.

రాజకీయాలకు సినిమా ఇండస్ట్రీకి సంబంధంలేదని సురేష్ అన్నారు. సినిమా వాళ్ళు సినిమాల మీద మాత్రమే దృష్టిపెడితే బాగుంటుందన్నారు. రాజకీయాలకు సినిమా వాళ్ళు ఎంతదూరంగా ఉంటే అంత మంచిదన్నారు. చంద్రబాబు అరెస్టు విషయం చాలా సున్నితమైనదని అభిప్రాయపడ్డారు. దీనిపై సినీపరిశ్రమ స్పందించకుండా ఉంటేనే బాగుంటుందన్నారు. తమకు రాజకీయాలతో కానీ మీడియా రంగంతో కానీ ఎలాంటి సంబంధంలేదన్నారు. కాబట్టి రాజకీయాలగురించి మాట్లాడకుండా ఉంటేనే బాగుంటుందని తేల్చేశారు. ఇండస్ట్రీలో రాజకీయాలు ఉండకూడదన్నది మాత్రమే తన ఆలోచనగా సురేష్ స్పష్టం చేశారు. సో, సురేష్ తాజా స్పందన చూసిన తర్వాత ఎల్లోమీడియాకు పెద్ద షాక్ తగిలినట్లే అయ్యింది.మరింత సమాచారం తెలుసుకోండి: