చైనాకు సంబంధించిన బెల్ట్ అండ్ రోడ్డు ఇనిషియేటివ్ కి పోటీగా భారత్ ఒక అంతర్జాతీయ రహదారిని ఏర్పాటు చేయాలని చూస్తుందని తెలుస్తుంది. దీని కోసమే మొన్న జరిగినటువంటి జీ 20 సమావేశాలకు వచ్చిన అంతర్జాతీయ ప్రతినిధులతో కాగల కార్యాన్ని చక్కబెట్టే ప్రయత్నం చేసిందట భారత్. ఆ ప్రయత్నం ఫలించి యూరప్ దేశాలతో పాటుగా అరబ్ దేశాలు కూడా భారత్ ప్రపోజల్ కు  అంగీకరించాయి.


అయితే ఈ పరిణామాలు టర్కీ కి విపరీతమైన మంట ఎక్కిస్తున్నాయని తెలుస్తుంది. పాకిస్తాన్ ఎలాగైతే భారత్ అంటే చుక్కెదురులా ఉంటుందో, ఇప్పుడు టర్కీ కూడా అదే విధంగా ఉంటుందట. టర్కీ భారత్ కు సంబంధించిన అనేక విషయాల్లో భారత్ తో విభేదిస్తుంది. కాశ్మీర్ కు సంబంధించిన విషయంలో కానీ, అక్కడ ముస్లింస్ కి సంబంధించిన విషయంలో గాని భారత్ కు వ్యతిరేక స్టాండ్ ను తీసుకుంది టర్కీ.


అయితే తాజాగా భారత్ ప్రధాని నరేంద్ర మోడీ టర్కీకి వ్యతిరేకమైనటువంటి గ్రీస్ దేశాలను ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారట. దాంతో టర్కీకి మరింత ఆగ్రహం కలిగించినట్లయింది భారత్. అయితే ఇది మనసులో పెట్టుకున్న టర్కీ, భారత్ ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఫైనాన్షియల్ టైమ్స్ సర్వే ప్రకారం టర్కీ భారత్ సూచించిన రహదారి కాకుండా, ఒక కొత్త రహదారి కోసం  ఇరాక్, కత్తర్, దుబాయిలతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తుంది.


అయితే ఆ మూడు దేశాలు ముస్లిం దేశాలు కావడంతో వారు కూడా సమ్మతించే అవకాశం ఉంటుందట. అయితే రాబోయే కాలంలో   ఇక్కడ ఆయిల్ వ్యాపారాలు దెబ్బతినే అవకాశం ఉందట. దాంతో ఆయిల్ కోసం  ఇతర యూరప్ దేశాలు, ఇతర ఆసియా దేశాల సహాయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ రకంగా వీళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం వల్ల కొత్త వ్యాపార స్థావరాలు ఏర్పడి కొత్తగా లాభాలు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఆఫ్రికాలో మాదిరి అన్నీ ఉన్నా కూడా వాడుకోలేని దుర్భర పరిస్థితి అయిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: