పాపం అనేది పండకుండా పోదు. 100గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు హరి అంది  అన్న సామెత నిజమైంది హర్దీప్ సింగ్ నిజ్జర్ విషయంలో. ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ అధినేత ఈ హర్దీప్ సింగ్ నిజ్జర్. అయితే ఈ వ్యక్తిని ఈ ఏడాది జూన్18వ తారీఖున కెనడాలోని ఓ గురుద్వారాలో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు.  అయితే ఈ హత్య వెనుక భారత్ హస్తం ఉందని  కెనడా ప్రధాని జస్టిన్ ఆరోపించారు.


భారతదేశంలో ఖలిస్తానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంకల్పించుకున్న హర్దీప్ సింగ్  రైతుల పేరుతో ఎర్రకోటపై దాడి చేయడం జరిగింది. 1997లో భారత్ నుంచి ఆయన కెనడాకు వలస వెళ్లాడు. అయితే అక్కడ శరణార్థిగా  ఉండేందుకు పెట్టుకున్న అభ్యర్థనను అక్కడ ప్రభుత్వం నిరాకరించింది. ఆ తర్వాత 2020లో హర్దీప్ సింగ్  అంతర్జాతీయ ఖలిస్తానీ టెర్రరిస్ట్ గా పరిగణించడం జరిగింది.


ఆ తర్వాత ఖలిస్తానీ   టైగర్ ఫోర్స్ యువకులకు తర్ఫీదు ఇచ్చి రిక్రూట్ చేసేవాడు. ఆ తర్వాత వాళ్లతో సిఖ్స్ ఫర్ జస్టిస్ అనే ఒక గ్రూపును కూడా నడపడం జరిగింది. నిజ్జర్ కు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు ఎన్నోసార్లు కెనడాకు భారత్ చెప్పడం జరిగింది. 2018లో పంజాబ్ ముఖ్యమంత్రి అమరేందర్ సింగ్ ఉగ్రవాదుల వాంటెడ్ లిస్ట్ ను కెనడా ప్రధానికి అందించగా అందులో నిజ్జర్  పేరు కూడా ఉంది.


అయితే ఇలాంటి నేరస్తుడు ఏ దేశంలో అయితే దాగి ఉన్నాడో అదే దేశంలో హత్య చేయబడడం విచిత్రం . భారత్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగం రాహత్య వెనుక ప్రధాన పాత్ర పోషించిందని ట్రూడో చెప్పడం జరిగింది. అయితే ఇదే మాటను ట్రూడో  అమెరికా, యూరప్ దేశాలకు చాటి చెప్పడానికి సిద్ధమయ్యాడట. తన పార్లమెంట్ ప్రసంగంలో ఇదే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది ఆయన. అంతే కాకుండా ఆయనకు దొరికిన రుజువులతో భారత్ ను ప్రపంచ దేశాల ముందు నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: