‘జైలు మోహన్ కు బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు’ ఇది నారా లోకేష్ తాజాగా తన ట్విట్టర్లో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యంగ్యంగా చేసిన ట్విట్. ‘జైలు మోహన్ ప్రజాస్వామ్య వ్యవస్ధలను ధ్వసంచేస్తున్నారు. రు. 42 వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేశారు. జగన్ పై సీబీఐ, ఈడీ సహా 38 కేసులున్నాయి. జైలులో ఉండాల్సిన ఆయన పదేళ్ళుగా బెయిల్ పైన బయటున్నారు’ జగన్ను ఎద్దేవాచేస్తు లోకేష్ చేసిన ట్వీట్ ను ఐటీడీపీ, టీడీపీ బాగా వైరల్ చేస్తోంది.

లోకేష్ ట్విట్ చూస్తుంటే జగన్ను రెచ్చగొడుతున్నట్లే ఉంది. తన తండ్రి చంద్రబాబునాయుడును స్కిల్ స్కామ్ లో అరెస్టుచేసి రిమాండుకు పంపటాన్ని, విచారించటాన్ని లోకేష్ అస్సలు తట్టుకోలేకపోతున్నారు. ఈ విషయం జగన్ పై చేసిన ట్వీట్ తో అర్ధమవుతోంది. ఏపీలోకి వస్తే తనను కూడా ఎక్కడ అరెస్టుచేస్తారో అన్న భయంతోనే లోకేష్ బయటెక్కదో దాక్కున్నారని మంత్రులు పదేపదే ఎద్దేవాచేస్తున్నారు. దానికి తగ్గట్లే ఎక్కడున్నాడో కూడా తెలీకుండా లోకేష్ దాక్కున్నారు.

జగన్ మీద కేసులు, బెయిళ్ళు, విచారణలు అన్నీ జనాలకు అర్ధమయ్యాయి. కాబట్టి ఆ విషయాలను లోకేష్ కొత్తగా జనాలకు చెప్పాల్సిన పనిలేదు. ఇపుడు కొత్తగా జనాలు తెలుసుకోవాల్సింది ఏమన్నా ఉంటే చంద్రబాబు స్కిల్డ్ అవినీతి మాత్రమే. ఇంతకాలం తాను నిప్పునని, తాను అవినీతికి పాల్పడినట్లు ఎక్కడా సాక్ష్యాధారాలు లేవని చెప్పుకునే వారు. అలాంటిది సాక్ష్యాలతో సహా మొదటిసారి చంద్రబాబు దొరికిపోయారు. ఈ విషయం లోకేష్ తో పాటు చాలామందికి జీర్ణంకావటంలేదు.

చంద్రబాబు, లోకేష్, తమ్ముళ్ళ వాదన ఎలాగుందంటే తప్పుచేసి దొరికినా సరే అరెస్టుచేయకూడదన్నట్లు ఉంది. అందుకనే జగన్ పై మంటను ట్వీట్ల రూపంలో బయటపెట్టుకుంటున్నారు. చంద్రబాబు అవినీతికి ప్రాధమిక సాక్ష్యాలున్నాయని ఏసీబీ కోర్టు, హైకోర్టు నమ్మితేనే కదా చంద్రబాబు పిటీషన్లు డిస్మిసయ్యాయి. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపిస్తోంది. స్కామ్ జరగలేదని చంద్రబాబు నోటిమాటతో బుకాయిస్తున్నారు. ఇక్కడే అడ్డంగా దొరికిపోయింది. అయినా తన వాదనను పదేపదే వినిపిస్తునే ఉన్నారు. దాన్నే లోకేష్ తన ట్వీట్లో ప్రస్తావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: