జనసేన అధినేతగా తనిష్టం వచ్చిన నిర్ణయం తీసుకున్నా పార్టీ మొత్తం నోరెత్తకుండా ఫాలో అయిపోతారనే భ్రమలో పవన్ కల్యాణ్ ఉన్నారు. కానీ వాస్తవానికి అందుకు రివర్సులో వ్యవహారాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబు తిరుపతిలో రెండురోజులు పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీనేతలతో సమావేశాలు పెట్టుకున్నారు.





ఈ నేపధ్యంలోనే నాగబాబు సమావేశంలో మాట్లాడుతున్నపుడు సడెన్ గా ఒక నేత లేచి జనసేన ఎప్పటికి రెండుపార్టీల జెండాలు మోయాల్సిందేనా అని నిలదీశారు. దాంతో నాగబాబుకు షాక్ కొట్టినట్లయ్యింది. వెంటనే తేరుకుని ఎవరు బాబు అడిగింది అని ఆరా తీశారు. దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఏమి డిస్కషన్ జరిగిందో తెలీలేదు. మొత్తానికి ఈ ఒక్క ప్రశ్నచాలు జనసేనలో పవన్ నిర్ణయంపై ఏకగ్రీవ ఆమోదంలేదని చెప్పటానికి.





ఇదే సమయంలో పవన్ నిర్ణయంపై నేతల్లో బాగా అసంతృప్తి బయటపడుతోంది. ఏ ఎన్నికను తీసుకున్నా ఏదో ఒక పార్టీతో పొత్తుపెట్టుకోవటం వాళ్ళ జెండాను కూడా జనసేన నేతలు, క్యాడరే మోయాల్సొస్తోంది. దాంతో నేతలు, కార్యకర్తలు బాగా విసిగిపోతున్నారు. ఈ నేపధ్యంలోనే మంత్రులు, వైసీపీ నేతల నుండి జనసేన నేతలు, కార్యకర్తలను జెండా కూలీలనే సెటైర్లు పడుతున్నాయి. దీన్ని జనసేన నేతలు, క్యాడర్ తట్టుకోలేకపోతున్నారు. అందుకనే గెలుపోటములతో సంబంధంలేకుండా పార్టీ ఒంటరిగానే పోటీచేయాలని పదేపదే డిమాండ్ చేస్తున్నారు.





అయితే వీళ్ళకి అర్ధంకాని విషయం ఒకటుంది. అదేమిటంటే జనసేనను గెలిపించాలని, తాను గెలవాలని పవన్ కల్యాణ్ కు ఎప్పుడూ లేదు. తన టార్గెట్ అంతా జగన్మోహన్ రెడ్డిని ఓడించటం, చంద్రబాబునాయుడును అధికారంలోకి తీసుకురావటమే. మామూలుగా ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చేది తాము పదవులకు అందుకోవాలని. అంతేకానీ పక్కోడు పదవులు అందుకోవటానికి సాయం చేయాని ఎవరూ అనుకోరు. కానీ పవన్ మాత్రం రివర్సులో ఆలోచిస్తున్నారు కాబట్టే రాజకీయం కూడా రివర్సులోనే నడుస్తోంది. అందుకనే ఇపుడు పార్టీలో కూడా రివర్స్ ఫిట్టింగులు తప్పేట్లు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: