ఉక్రెయిన్ ను అడ్డుపెట్టి రష్యా ను దెబ్బకొట్టాలని చూస్తున్న అమెరికాకు చావు దెబ్బ తగిలింది. అమెరికాలో ప్రస్తుతం 1 వ తారీఖుకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. అదే సమయంలో ఉక్రెయిన్ కు నిధులు ఆపేయాలని, ఆయుధాల సరఫరాను తగ్గించాలని లేకపోతే అమెరికా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉందని అక్కడి పార్లమెంటు లో వాదనలు కొనసాగాయి.


చివరకు రిపబ్లికన్లు మద్దతు తెలపడం ద్వారా బిల్లు పాసై జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. యూరప్ దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధాలు ఇవ్వడం తగ్గించేశాయి. 10 వేల మంది ఉక్రెయిన్ సైనికులు రష్యాకు లొంగిపోయారు. కొన్ని లక్షల మంది చనిపోయారు. 30 దేశాలు కలిసి ఉక్రెయిన్ కు సాయం చేస్తున్న రష్యా ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉక్రెయిన్ గెలవదు.


తామే గెలుస్తామని చెబుతూ ముందుకు సాగుతోంది. రష్యాకు చైనా, ఇరాన్ లాంటిని ఆయుదాలు సప్లై చేస్తుండొచ్చు. కానీ అమెరికాను, యూరప్ దేశాలను నమ్మకుండా ఉక్రెయిన్ సైనికులు రష్యా కు లొంగిపోతున్నారు. అంటే అమెరికాను ఇక నమ్మడం ఆపేశారు. ఎందుకంటే ఇది కేవలం రాజకీయ కుట్రలో భాగంగా జరుగుతున్న యుద్ధం అని భావిస్తున్నారు. అమెరికా తన ఆయుధ సామగ్రిని అమ్ముకోవడానికి రష్యా ను ఢీకొని ప్రపంచంలో పెద్దన్న పాత్రను పోషించే స్థాయిలో ఉండాలని ఎప్పుడూ అనుకుంటుంది. కానీ ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అన్నివిధాల అండగా ఉంటామని హామీ ఇచ్చిన అగ్రరాజ్యం


రోజు రోజుకు ఆయుధాల సరఫరాను తగ్గిస్తూ ఉక్రెయిన్ కు చెక్ పెడుతుంది. కానీ ఇంకా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మాత్రం రష్యా పై గెలుస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎప్పటికీ జరగని పని అని తెలుసుకోవాలి. ఇప్పటికైనా ఉక్రెయిన్ పౌరుల ప్రాణాలు కాపాడాలంటే శాంతి యుతంగా చర్చలకు కూర్చొని ముందుకు సాగాలి. లేకపోతే మరింత మారణహోమం తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: