యువగళం పాదయాత్ర పునఃప్రారంభం సందర్భంగా లోకేష్ చేసిన జోకులను తట్టుకోవటం కష్టంగా ఉంది. అధికారపార్టీకి భయాన్ని పరిచయటం చేసే బాధ్యత తాను తీసుకున్నట్లు ప్రకటించారు. అప్పటికి తానేదో చాలా పెద్ద మాస్ లీడరన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు.  తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో పాదయాత్ర మళ్ళీ ప్రారంభమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతు తన తండ్రి చంద్రబాబునాయుడును 53 రోజులు జైల్లో పెట్టినట్లు మండిపోయారు.





చేయని తప్పుకు చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టిన విషయాన్ని కోర్టు కూడా బెయిల్ ఉత్తర్వుల్లో చెప్పినట్లు లోకేష్ చెప్పటమే విచిత్రంగా ఉంది. నిజానికి బెయిల్ ఉత్తర్వుల్లో జడ్జి తన పరిధి దాటి మాట్లాడారని మంత్రులు, ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకనే హైకోర్టు ఉత్తర్వులను చాలెంజ్ చేసి సుప్రింకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ వేసింది. చంద్రబాబు స్కిల్ స్కామ్ లో అవినీతికి పాల్పడినట్లు ప్రాధమిక ఆధారాలున్నాయని ఏసీబీ కోర్టు అభిప్రాయపడింది.





ఇదే హైకోర్టు చంద్రబాబు దాఖలుచేసిన క్వాష్ పిటీషన్ను కూడా డిస్మిస్ చేసేసింది. అయితే మరో జడ్జి  మాత్రం చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అభిప్రాయపడ్డారు. మరి జడ్జీల మధ్య ఇతంటి వైరుధ్యాలు ఏమిటో అర్ధంకావటంలేదు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు సీఐడీ చూపించిన ఆధారాల్లో బెయిలిచ్చిన జడ్జి దేన్నీ అంగీకరించకపోవటమే ఆశ్చర్యం. నిజానికి బెయిల్ ఇవ్వాలా వద్దా అని మాత్రమే డిసైడ్ చేయాల్సిన జడ్జి కేసు మూలాల్లోకి వెళ్ళటాన్నే ప్రభుత్వం తీవ్రంగా ఆక్షేపిస్తోంది.





సరే జడ్జి తమకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలను లోకేష్ ఇపుడు అనుకూలంగా మలచుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి భయం పరిచయం చేస్తానని లోకేష్ సినిమా డైలాగులు చెప్పటమే పెద్ద జోక్ గా ఉంది. చంద్రబాబును  అరెస్టు చేయగానే తన అరెస్టుకు భయపడి వెళ్ళి ఢిల్లీలో ఎందుకు కూర్చున్నారో చెబితే బాగుంటుంది. అరెస్టుకు భయపడి ఏపీ నుండి పారిపోయిన వ్యక్తి కూడా ప్రభుత్వానికి లేదా వైసీపీకి భయాన్ని పరిచయం చేస్తానని బెదిరిస్తుండటమే నవ్వు తెప్పిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: