దేశంలో ఇస్లామిక్ ఉగ్రదాడుల అతి పెద్ద భారీ ప్లాన్ ను గుజరాత్ పోలీసులు ఛేదించారు. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్, అహ్మదాబాద్ పట్టణాల్లో భారీ విధ్వంసాలు చేయడానికి కుట్ర పన్నినట్లు గుర్తించి కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. గతంతో పోల్చితే ఈ సారి భారీ సంఖ్యలో విధ్వంసం చేయడానికి ప్లాన్ వేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా ఈ దాడుల వెనక అలీగర్ ముస్లిం యూనివర్సిటీకి సంబంధించిన స్టూడెంట్లు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఇస్లామిక్ ఉగ్రవాద దాడి ప్లాన్ ను గుజరాత్ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలోని ఓ రహస్య స్థావరం నుంచి ఐసిస్ సానుభూతి పరుడు షానవాజ్ ఆసిఫ్ ఆపరేటర్ గా ఈ దాడులకు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అతడిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. గత నెల పోలీసులను అరెస్టు చేయగా అతన్ని విచారించగా గుజరాత్ లోని గాంధీనగర్, అహ్మదాబాద్ లో దాడులకు కుట్ర పన్నినట్లు దీంతో పాటు గేట్ వే ఆప్ ఇండియా వద్ద కూడా భారీ విధ్వంసానికి ప్లాన్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.


ఈ దాడుల్లో అలీఘర్ విద్యార్థుల ప్రమేయం ఉన్నట్లు కూడా తెలిపారు. షానవాజ్ భార్య కూడా ఈ విధ్వంసం చేయడంలో పాత్ర ఉన్నట్లు తేల్చారు. షానవాజ్ భార్య ఒకప్పుడు హిందువు అని ఆమెను మతం మార్చి ఇలా చేయడానికి ఉసిగొల్పరాని తెలుస్తుంది. మతం మార్చిన తర్వాత హిందువుల మీద దాడులు చేయడంతో పాటు ఎక్కువ విధ్వంసం జరిగేలా ప్లాన్ చేశారు.


అయితే ఈ కుట్రలను గుజరాత్ పోలీసులు భగ్నం చేయడంతో పాటు ఎవరెవరూ ఇందులో ఉన్నారో వారిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఎక్కువ న్యూస్ లు రావడం లేదు. ఏదో పత్రికల్లో చివరన లేదా లోపలి పేజీల్లో చూపిస్తున్నారు. ఉగ్రదాడుల నుంచి ప్రజలకు అవేర్ నెస్ కల్పించేందుకు మీడియా, పోలీసులు జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: